గుంటూరులో పోలీసుల పేరుతో యువ‌తిపై గ్యాంగ్‌రేప్‌…న‌లుగురు అరెస్టు

గుంటూరు జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్టు చేశారు. గ‌త నెల 26న తెనాలి డివిజ‌న్‌లోని వేమూరు స‌మీపంలో అర్ధ‌రాత్రి ఓ యువ‌తిపై కొంద‌రు పోలీసులు పేరుతో సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ కేసులో నలుగురిని నిందితులుగా గుర్తించగా, మరో ఇద్దరు కూడా ఈ దారుణానికి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన స్థలంలోనే ఇద్దరిని పట్టుకున్న పోలీసులు మిగిలిన నలుగురిని బుధవారం అరెస్టు చేశారు.

పోలీసుల వివ‌రాల ప్ర‌కారం కొల్లూరుకు చెందిన యువతి, మరో యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను బంధువులు అంగీకరించనందున వివాహం చేసుకునేందుకు గత నెల 26న కొల్లూరులో లారీ ఎక్కి వేమూరులో రైల్వే గేటు వద్ద దిగారు. రైల్వే స్టేషన్‌ సమీపంలో వేచి ఉన్న వీరిని అటుగా బైక్‌లపై వచ్చిన యువకులు గమనించి పోలీసుల పేరుతో బెదిరించారు. అనంతరం యువతిని బలవంతంగా తీసుకు వెళ్లి సమీప పొలాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతితో పాటు ఉన్న యువకుడు పోలీసులకు 100 నెంబర్‌ ద్వారా సమాచారం అందించడంతో వేమూరు ఎస్‌ఐ జీ.మోహన్‌ తన సిబ్బందితో అక్క‌డ‌కు చేరుకుని వెంకటేష్‌, సుధాకర్‌ అనే ఇద్దరిని పట్టుకున్నారు.

త‌ర్వాత ఆ యువ‌తిపై రేప్ చేసిన వారితో పాటు వారికి స‌హ‌క‌రించి వారితో క‌లిపి మొత్తం ఆరుగురు నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న జిల్లాలో పెద్ద క‌ల‌క‌లం రేపింది. నిందితుల‌లో రేప‌ల్లెకు చెందిన ఆర్మీ జ‌వాన్ కూడా ఉండ‌డం శోఛ‌నీయం.