రెండు గంటలకు సోనియా గాంధీ ప్రెస్ మీట్

యుపిఎ ఛైర్ పర్నస్ సోనియా గాంధి ఈరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఎన్ డి ఎ మిత్ర పక్షాలు స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. నరేంద్రమోడీ ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టనుండండం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయ్ బరేలి నుంచి సోనియా గాంధీ ముందజలో ఉంది. అయితే ఆమె తనయుడు రాహుల్ గాంధీ అమెధీలో వెనకంజలో ఉన్నాడు. సోనియా గాంధీ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతారో అనే ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 

కాంగ్రెస్ – 73

బిజెపి ప్లస్ – 307

సిపిఐ – 10

సిపిఎం – 8

బిఎస్పి – 7

ఎఐడిఎంకె – 34

డిఎంకె – 5

టిఎంసి – 20

ఎస్ పి – 10

ఎన్ సి పి – 6

జెడియు – 2

ఆప్ – 5

బిజెడి – 3

ఆధిక్యంలో ఉన్నాయి.