54కు చేరిన దక్షిణ కొరియా నౌకా మృతులు

దక్షిణ కొరియా నౌకా ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 54కు చేరింది. విషాదకరమైన ఈ ఘటన ఈనెల 16న జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 476 మంది ప్రయాణికులు నౌకలో విహారానికి బయలుదేరారు. విహార యాత్ర ముగించుకొని తిరగి వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఇప్పటివరకు 174 మందిని రక్షించగలిగారు.

దాదాపు 200 పడవల సాయంతో 35 ఎయిర్ క్రాఫ్టులు  ఈప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంకా 248 మందిని కాపాడాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వాతావరణం సహకరించకపోవడంతో రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. గజ ఈతగాళ్లు మృతుల్ని గాలిస్తున్నారు. అయితే సముద్రంలో మునిగిన నౌకను వెలికి తీసేందుకు సుమార్ రెండు నెలల సమయం పట్టే అవకాశముందని అధికారులు అంచనా వేశారు.