రాణీ సౌమ్యాదేవి కోసం శ్రీదేవి ఒరిజినల్ గోల్డ్… పులి గ్రాఫిక్స్ వారి చేతుల్లోనే

ఇళయదళపతి విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ నిర్మిస్తున్న చిత్రం పులి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఆలిండియా స్టార్ శ్రీదేవి ఈ చిత్రంలో రాణి సౌమ్యాదేవిగా నటిస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం ఆమె ఒరిజినల్ బంగారు ఆభరణాలు ధరించడం విశేషం. శ్రీదేవి లుక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మేకప్ కోసం రోజులు నాలుగైదు గంటలు కేటాయించేదట. మేకప్ బరువు దాదాపు పది నుంచి పదిహేను కోలోలు ఉండేదట. ఈ సినిమా కోసం శ్రీదేవి కత్తి యుద్ధాలు సైతం చేసింది.

డెన్మార్క్, రష్యా, ఐర్లాండ్, ఉక్రెయిన్, ఆర్మేనియా దేశాలకు చెందిన టెక్నీషియన్స్ ఈ సినిమా గ్రాఫిక్స్ గురించి పని చేస్తున్నారు. ఆగస్ట్ నెలాఖరులో విడుదల చేస్తారు. శృతీహాసన్, హన్సిక ఈ చిత్రంలో హీరోయిన్స్. సుదీప్, ప్రభు లాంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు.