జల్సారాయుడులో శ్రీకాంత్ కొత్తగా ఉంటాడు

శ్రీకాంత్, ఎస్తేర్, ప్రాచీ సిన్హా హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటరమణ మూవీస్ పతాకంపై సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వంలో కౌలన్ వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రం జల్సా రాయుడు. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ…. టైటిల్ కు తగ్గట్టుగా నా పాత్ర ఉంటుంది. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. దర్శకుడు మంచి కథ తయారుచేశాడు. గాలిపటం కెమెరామెన్ బుజ్జి అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

దర్శకుడు సి.హెచ్.సుధీర్ రాజు మాట్లాడుతూ… ఇటీవలే మా చిత్రం శరవేగంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రతీ ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉంటుంది. అక్టోబర్ మొదటి వారం నుంచి రెండో షెడ్యూల్ పూర్తవుతుంది. అని అన్నారు. 

నిర్మాత కొలన్ వెంకటేష్ మాట్లాడుతూ… మా చిత్రం మొదటి షెడ్యూల్ మేం అనుకున్న టైంలో పూర్తి చేయగలిగాం. శ్రీకాంత్ పాత్ర కొత్తగా ఉంటుంది. చక్రి సంగీతం మా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అని అన్నారు.