శ్రీమంతుడు ఆడియో రివ్యూ – దేవీ మాయ చేసాడు..

టాలీవుడ్ లో కుర్ర మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఎంత‌మందైనా ఉండ‌నీ.. అందులో దేవీ శ్రీ ప్ర‌సాద్ మాత్రం డిఫెరెంట్. అవ‌కాశాలు వ‌స్తున్నాయి క‌దా అని కుప్ప‌లు తెప్ప‌లుగా సినిమాలు ఒప్పుకోవ‌డం ఈయ‌న‌కు తెలియ‌దు. మ‌న‌సుకు న‌చ్చిన క‌థ‌ల‌ను మాత్ర‌మే చాలా సెలెక్టివ్ గా ఎంచుకుంటాడు ఈ సంగీత త‌రంగం. తాజాగా ఈయ‌న స్వ‌ర‌ప‌రిచిన శ్రీ‌మంతుడు పాటలు శ్రోత‌ల‌ను మాయ చేస్తున్నాయి. నేనొక్క‌డినేతో మహేశ్ కు మంచి మ్యూజిక‌ల్ ఆల్బమ్ ఇచ్చిన దేవీ.. ఇప్పుడు శ్రీ‌మంతుడుతో మ‌రోసారి అద‌ర‌గొట్టాడు. పైగా ద‌ర్శ‌కుడు కొర‌టాల కావ‌డంతో మ‌రింత రెచ్చిపోయాడు దేవీ.

ముఖ్యంగా రామ రామ‌, శ్రీ‌మంతుడా అంటూ సాగే పాటలు మాత్రం ఆల్బ‌మ్ కు హైలైట్ గా నిలిచాయి. సినిమా విడుద‌ల‌య్యే లోపే మిగిలిన పాట‌లు కూడా జ‌నాల్లోకి వెళ్లి.. సినిమాపై మ‌రింత హైప్ పెంచేస్తాయేమో మ‌రి. ఏదేమైనా దేవీ శ్రీ ప్ర‌సాద్ సూప‌రంతే..!