శ్రీ‌ముఖి కొంప ముంచేసిన త్రివిక్ర‌మ్..

అదేంటి.. త్రివిక్ర‌మ్ ఏం చేసాడు పాపం అనుకుంటున్నారా..? విన‌డానికి కాస్త వింత‌గా ఉన్నా.. శ్రీ‌ముఖి కొంప ముంచేసింది మాత్రం మాట‌ల మాంత్రికుడే. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈ అమ్మాయిగారిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది త్రివిక్ర‌మే. జులాయి సినిమాలో అల్లుఅర్జున్ కు చెల్లిగా ఈ బ్యూటీని తీసుకొచ్చాడు త్రివిక్ర‌మ్. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయింది. దెబ్బ‌కు శ్రీ‌ముఖి కూడా సూపర్ పాపుల‌ర్ అయిపోయింది. త‌ర్వాత టీవీ షోస్ లో యాంక‌ర్ గా సూప‌ర్ ఫేమ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ‌.
ఎంత‌కాలం అని యాంక‌ర్ లుగా చిన్నితెర‌పైనే ఉంటారు చెప్పండి..? పైగా యాంక‌ర్స్ హీరోయిన్లుగా మార‌డం ఇప్ప‌టి ట్రెండేమీ కాదు. చాలా ఏళ్ళ నుంచి జ‌రుగుతోన్న ప్రాసెస్ అది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు యాంక‌ర్స్ ఎవ్వ‌రూ హీరోయిన్లుగా స‌క్సెస్ మాత్రం కాలేక‌పోయారు. ఒక‌ట్రెండు సినిమాల‌తో ఫేడ‌వుట్ అయిపోవ‌డ‌మో.. లేదంటే కారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోవ‌డ‌మో చేస్తారు. ఇప్పుడు అనసూయ‌, ర‌ష్మి చేస్తోన్న‌ది కూడా అదే. ఇప్పుడు శ్రీ‌ముఖి కూడా ఇదే బాగా ట్రై చేస్తోంది. అయితే అమ్మ‌డు ట్ర‌య‌ల్స్ మాత్రం పెద్ద‌గా ఫ‌లించ‌ట్లేదు.
ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఈ ముద్దుగుమ్మ‌కు చేసిన అన్యాయం గురించి మాట్లాడ‌దాం. ఈ మ‌ధ్యే బ‌న్నీ సినిమా కోసం శ్రీ‌ముఖిని రెండో హీరోయిన్ గా తీసుకోవాలా అని ఆలోచించారు మేక‌ర్స్. అయితే ఈ ప్ర‌పోజ‌ల్ కు స‌సేమిరా అన్నాడ‌ట బ‌న్నీ. దానికి కార‌ణం జులాయి సినిమానే. అందులో త‌న‌కు శ్రీ‌ముఖి చెల్లిగా న‌టించ‌డ‌మే దీనికి కార‌ణం. చెల్లిగా న‌టించిన అమ్మాయితో హీరోయిన్ గా న‌టించ‌డం అసాధ్యం అని తేల్చేసాడట బ‌న్నీ. త్రివిక్ర‌మ్ చేసిన ప‌నికి ఇప్పుడు శ్రీ‌ముఖికి అద్భుత‌మైన అవ‌కాశం చేజారిన‌ట్లే క‌దా..! మొత్తానికి అప్పుడెప్పుడో చేసిన కారెక్ట‌ర్ ను ఇప్ప‌టికీ బ‌న్నీ గుర్తు పెట్టుకుని మ‌రీ.. శ్రీ‌ముఖిని చెల్లెలుగానే ట్రీట్ చేస్తున్నాడ‌న్న‌మాట‌..!