మ‌రీ ఈ స్థాయిలోనా థ‌మ‌న్..?

కాపీక్యాట్.. ఈ ప‌దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం.. 90 కేజీల సాక్ష్యం.. మ‌న కుర్ర సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్. కింగ్ సినిమాలో ప‌క్క భాష‌ల్లో హిట్టైన ట్యూన్స్ ను దొబ్బేసి మ్యూజిక్ ఇస్తాడు బ్ర‌హ్మానందం. నిజంగా ఇండ‌స్ట్రీలో ఇలాంటివి చూసి చూసి విసుగొచ్చే శీనువైట్ల కింగ్ సినిమాలో ఈ కామెడీ పెట్టేసిన‌ట్లున్నాడు. మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎలాగూ పక్క ఇండ‌స్ట్రీల‌తో ప‌నిలేదు. అందుకే అక్క‌డ హిట్టైన పాట‌ల్నీ ఎం చ‌క్కా ఇక్క‌డ కాపీ కొట్టేస్తున్నారు. 

ఆ మ‌ధ్య విడుద‌లైన‌ డిక్టేట‌ర్ సినిమాలో గ‌మ్ గ‌మ్ గ‌ణేషా అనే పాట భ‌జ‌రంగీ భాయీజాన్ లోని లే బేటా సెల్ఫీ లేలే సాంగ్ కు కాపీ.
అక్కడ ఆంజ‌నేయుడు మీద సాగే పాట‌ని ఇక్క‌డ గ‌ణేష్ మీద‌కు మార్చేసాడు థ‌మ‌న్. రెండూ దేవుళ్లే క‌దా అని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు ఈ మ్యూజిక్ డైరెక్ట‌ర్. కానీ ప్రేక్ష‌కులు చాలా తెలివైనోళ్లు క‌దా అందుకే మ‌నోడి ప‌నిత‌నాన్ని ప‌ట్టేసారు. అయితే ఇక్క‌డే చిన్న మ‌త‌ల‌బు కూడా ఉంది. హిందీలో భ‌జ‌రంగీని డిస్ట్రిబ్యూట్ చేసింది ఎరోస్ సంస్థ‌. ఇక్క‌డ డిక్టేట‌ర్ ను నిర్మిస్తున్నది కూడా వాళ్లే. అలా ఇద్ద‌రూ మ్యూచువ‌ల్ అండ‌ర్ స్టాండింగ్ తో ట్యూన్ తీసుకున్నారా అనేది వాళ్ల‌కే తెలియాలి.

థ‌మ‌న్ ఇలా కాపీ ఇప్పుడు పీక్స్ కు చేరిపోయింది. తాజాగా విడుద‌లైన శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తులో అను అను ఎక్క‌డో విన్న‌ట్లే ఉంటుంది. ఇక ఇందులో దేసీగాల్ సాంగ్.. ఆంజ‌నేయులు సినిమాలోని న‌న్నుంటుకోమాకే ఓ మ‌ర‌ద‌లా పాట‌కు కాపీ. ఆది చుట్టాల‌బ్బాయిలోని పాల‌మూరి పాల‌పిట్ట సాంగ్ హిందీలో స‌న్నీలియోన్ బేబీగాల్ కు కాపీ. థ‌మ‌న్ కాపీ కొట్ట‌డం ఇదే తొలిసారేం కాదు. బ్రూస్ లీ లోని కుంగ్ ఫూ కుమారి సాంగ్ ఫ‌టా పోస్ట‌ర్ నిక్ లా హీరోలోని ద‌టింగ్ నాచ్ అనే పాట‌కు కాపీ. ఇక ఆగ‌డులోనూ భేల్ పూరీ సాంగ్ ట్యూన్స్ కూడా బ్రూస్ లీ పాట‌ల్లో వినిపిస్తాయి. బాద్షా డైమండ్ గాళ్ సాంగ్ ను కాస్త మార్చేసి బ్రూస్ లీలో రియా చేసేసాడు థ‌మ‌న్.

ఏ సినిమా చూసిన ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం అన్న‌ట్లు.. థ‌మ‌న్ ప్ర‌తీ సినిమాలోనూ ఏదో ఓ పాట ప‌క్క భాష‌ల్లో హిట్టైన సాంగ్స్ ఉండ‌టం కామ‌నైపోయింది. ఆ మ‌ధ్య ప‌వ‌ర్ లో వ‌చ్చిన నాటంకీ రాంబో రాజ్ కుమార్ లోని సాడీ కే ఫాల్ సేకు కాపీ.. బ‌లుపుతో కాజ‌ల్ చెల్లివా.. బిజినెస్ మ్యాన్ లో పిల్లా చావ్.. కిక్ లో క‌న్నెత్తి చూడ‌కే.. ఇలా చెప్పుకుంటూ పోతే థ‌మ‌న్ కాపీ చిట్టా చాంతాడంత అవుతుంది. మొత్తానికి ఇప్ప‌టికైనా థ‌మ‌న్ త‌న బుర్ర‌కి ప‌నిచెప్పి కొత్త ట్యూన్స్ ఇస్తాడా.. లేదంటే వినేవాళ్లు వింటార్లే అని మ‌ళ్లీ అవే ఇచ్చేస్తాడా చూడాలి.