డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డికి ఘన సన్మానం

కళాబంధు, సాంస్కృతిక రత్న, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఇటీవల 71వ సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. నిజాయితీకి మారుపేరుగా, అర్థవంతమైన,ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన సుబ్బరామిరెడ్డి 71 వసంతాలు పూర్తిచేసుకున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనను పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించనున్నారు. సెప్టెంబర్ 26 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ సన్మానకార్యక్రమం జరగనుంది.

బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లోని ‘పార్క్ హయత్’ హోటల్ లోని బాల్ రూమ్ లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామాత్యులు ఎమ్.వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. ఇంకా ఈ వేడుకలో పార్లమెంట్ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున , స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి.రామానాయుడు, డాక్టర్ బ్రహ్మానందం తదితరులు పాల్గొంటున్నారు.