ఆలీకి సుమ వార్నింగ్… రిపీట్ అయితే.. హెచ్చరిక

ప్రముఖ నటుడు, యాంకర్ ఆలీకి లేడీ యాంకర్ సుమ వార్నింగ్ ఇచ్చిందట. ఆదివారం జరిగిన సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్‌లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ను స్టేజ్ పైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ అరవింద్ గారు ట్రైలర్ లాంచ్ అనగానే ఎక్కడ నొక్కాలి..ఎక్కడ నొక్కాలి అని నన్ను అడుగుతున్నారు.

ఇంకా నయం ఆయన సుమను అడగలేదు అని ఆలీ జోక్ చేశాడు. దీంతో సుమ ఇబ్బంది పడ్డా స్టేజ్‌పై దేవుడా అని సింపుల్‌గా సర్దుకున్నారు. 

అయితే ప్రోగ్రామ్ ముగిశాక మాత్రం ఇంకో సారి ఇలాంటి కుళ్లు జోకులు వేస్తే బాగోదని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు అక్కడున్న వారి ద్వారా సమాచారం లీక్ అయ్యింది. 

ఆలీ ఇటీవల స్టేజ్‌ల మీద కుళ్లు/బూతు జోకులు ఎక్కువగా వేస్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. అయితే అవేమి పట్టించుకోకుండా మళ్లీ వాటిని రిపీట్ చేస్తున్నాడు. ఈ సారి సుమ వార్నింగ్‌తో అయినా మారతాడో లేదో చూడాలి.