కొలంబ‌స్.. విజ‌యానికి మార్గాన్ని క‌నిబెడ‌తాడా..?

ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాలంటే వారస‌త్వం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. ఆవ‌గింజంత అదృష్టంతో పాటు గుమ్మ‌డికాయంత టాలెంట్ కూడా ఉండాలి. వార‌స‌త్వం, టాలెంట్ రెండూ ఉన్నా.. అదృష్టం లేక స్టార్ స్టేట‌స్ కు దూరంగా ఉన్న హీరో సుమంత్ అశ్విన్. స్మార్ట్ లుకింగ్ తో ప‌డేసే ఈ కుర్రాడు కెరీర్ ను మ‌లుపుతిప్పే స‌రైన స‌క్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. అంత‌కుముందు ఆ త‌ర్వాత‌, ల‌వ‌ర్స్, కేరింత లాంటి సినిమాల‌తో సుమంత్ ఇప్ప‌టికే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే స్టార్ గా మాత్రం మార‌లేదు. 

ఇప్పుడు ఈ కుర్రాడు కొలంబ‌స్ అనే సినిమాతో వ‌చ్చేస్తున్నాడు. ర‌మేష్ సామ‌ల దీన్ని తెర‌కెక్కించాడు. నిజ‌మైన ప్రేమ‌ను క‌నుక్కోవ‌డానికి క‌స్ట‌ప‌డే కుర్రాడిగా సుమంత్ అశ్విన్ న‌టించాడు. ఈయ‌న‌కు జోడీగా చిన్న‌దాన నీ కోసం ఫేమ్ మిస్తీ, ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సీర‌త్ క‌పూర్ న‌టించారు. అక్టోబ‌ర్ 22న పండ‌గ సంద‌ర్భంగా కొలంబ‌స్ విడుద‌ల కానుంది. మ‌రి చూడాలి.. ఈ సినిమాతో సుమంత్ జాత‌కం ఎలా మార‌బోతుందో..?