రెగ్యులర్ షూటింగ్ లో సుమంత్ అశ్విన్ చిత్రం

అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ అశ్విన్ త్వరలో మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మ్రితిక నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహి ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సీహెచ్ నరసింహాచారి, ఇలవల నరసింహారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రచయిత వేమారెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యలర్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను

నిర్మాతలు తెలియజేస్తూ… సున్నితమైన ఈ ప్రేమకథలో అన్ని వర్గాల వారిని అలరించే అంశాలున్నాయి. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఈనెల 20నుంచి హైదరాబాద్ లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్ పై పాటను చిత్రీకరిస్తున్నాం. మే 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. అని తెలిపారు. 

తాగుబోతు రమేష్, వివా హర్ష, తులసీ, శివన్నారాయణ, తదితరులు నటిస్తున్నారు.