పాపం.. సునీల్ ఏం పాపం చేసాడు..?

సునీల్ ను తొక్కేస్తున్నారా..? ఇండ‌స్ట్రీలో అత‌డిపై కుట్ర జ‌రుగుతుందా..? ఈ కామెడీ హీరోకు నిజంగానే అవ‌కాశాలు రాకుండా అడ్డుకుంటున్నారా..? ఏంటి.. సునీల్ పై ఈ అనుమానాలు అనుకుంటున్నారా..? కానీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రిగే ప‌రిస్థితులు చూస్తుంటే మాత్రం ఇది నిజ‌మే అనిపిస్తుంది. సునీల్ పై నిజంగానే ఓ వ‌ర్గం క‌క్ష క‌ట్టింద‌నే ప్ర‌చారం కాస్త గ‌ట్టిగానే జ‌రుగుతుంది. కెరీర్ మొద‌ట్లో వ‌ర‌స విజ‌యాల‌తో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. ఇప్పుడు అటూ ఇటూ కాకుండా పోతున్నాడు. ఈ మ‌ధ్యే ఈడు గోల్డ్ ఎహే సైతం డిజాస్ట‌ర్ గా నిలిచింది. దీనికి తోడు ఇప్పుడు సునీల్ ను కావాల‌నే కొంద‌రు టార్గెట్ చేసార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

 

సునీల్ సినిమాలెంత చెత్త‌గా ఉన్నా.. క‌నీసం శాటిలైట్ అయ్యేవి. మ‌నోడికి బుల్లితెర‌పై ఉన్న క్రేజ్ చూసి.. ఫ్లాప్ సినిమాల‌ను కూడా కోట్లిచ్చి మ‌రీ కొన్నారు. కానీ ఇప్పుడు ఈ సీన్ రిపీట్ అవుతుంది. జ‌క్క‌న్నిసినిమా నుంచే ఈ సమ‌స్య మొద‌లైంది. నిజానికి జ‌క్క‌న్న ఫ్లాప్ కాదు.. యావ‌రేజ్ సినిమానే. కేవ‌లం సునీల్ ఇమేజ్ పైనే ఈ సినిమా చాలా చోట్ల బ‌య్య‌ర్ల‌ను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లింది. అలాంటి సినిమాను ఇప్పుడు ఛానెల్స్ ఏవీ కొన‌ట్లేదు. కావాల‌నే కొంద‌రు సునీల్ సినిమాల‌ను కొనొద్దంటూ ఛానెల్స్ ను హెచ్చరించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియ‌దు గానీ ఇండ‌స్ట్రీలో బాగా ప‌లుకుబ‌డి ఉన్న ఓ పెద్ద మ‌నిషి కూడా సునీల్ ను కాస్త జాగ్గ‌ర్త‌గా ఉండాలంటూ హెచ్చ‌రించాడు. మొత్తానికి మ‌రి సునీల్ కెరీర్ ఎటు వైపు వెళ్తుందో..? అస‌లు ఎవ‌రు ఈ క‌మెడియ‌న్ పై క‌క్ష గ‌ట్టారో..?