కోడి పందాలకు గ్రీన్‌సిగ్నల్..పందెం రాయుళ్లకు పండగే

కోడి పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ నేత కనుమూరి రఘురామకృష్ణంరాజు వేసిన ఫిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో హైకోర్టు కోడి పందాలు నిర్వహించకూడదని.. వాటిని అడ్డుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ+తెలంగాణలో పందెం రాయుళ్లు గగ్గోలు పెట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కనీసం ఆ మూడు రోజులు అయినా తమకు పందెం వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాజకీయనాయకులు కూడా పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు.

దీంతో ఈ భిన్నవాదనల నడుమ రఘురామకృష్ణం రాజు, ఆజల్, ఓలేటి రాజు అనే ముగ్గురు వ్యక్తులు సుప్రీంకోర్టులో ఫిటిషన్ వేశారు. దీంతో సుప్రీంకోర్టు సోమవారం హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ప్రస్తుతం ఉన్న యదాతథ స్థితిని కొనసాగించాలని చెప్పింది. దీంతో కోడి పందాలు వేసుకునేందుకు లైన్ క్లీయర్ అయినట్లయ్యింది. సుప్రీంకోర్టు తీర్పుతో పందెం రాయుళ్లకు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చినట్లయ్యింది.