టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్‌కు పదేళ్లు… టాప్‌లేపుతాడా

2005 కళ్యాణ్‌రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై వచ్చిన అతనొక్కడే సినిమాతో దర్శకుడు పత్తి సురేందర్‌రెడ్డి టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ రోజు సురేందర్‌రెడ్డి టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు. 2005-2015 ఈ దశాబ్దకాలంలో సురేందర్‌రెడ్డి చేసిన సినిమాలు వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు. అయితే దర్శకుడిగా అతనొక్కడే కేరీర్ స్టార్టింగ్ హిట్ ఇస్తే గతేడాది వచ్చిన రేసుగుర్రం సురేందర్‌రెడ్డి ఇమేజ్‌ను టాలీవుడ్ సినీ విలాకాశానికి తీసుకెళ్లింది.

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామంలో సురేందర్‌రెడ్డి 1975 డిసెంబర్ 7న జన్మించారు. అతనొక్కడే హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో అశోక్, ఊసరవెల్లి లాంటి డిఫరెంట్ కథాంశం ఉన్న సినిమాలు, ప్రిన్స్ మహేష్‌బాబుతో అతిథి తెరకెక్కించారు. ఇక 2009లో వచ్చిన కిక్ సురేందర్‌రెడ్డి కేరీర్‌కు మంచి కిక్ ఇస్తే, గతేడాది వచ్చిన రేసుగుర్రం సురేందర్‌రెడ్డిని టాలీవుడ్ అగ్ర దర్శకుల జాబితాలో చేర్చేసింది.

ప్రస్తుతం రవితేజ్‌తో కిక్ సినిమాకు కొనసాగింపుగా కిక్-2 సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సినిమా అతనొక్కడేతోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. సురేందర్‌రెడ్డి భవిష్యత్తులో మరెన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందించి….మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పల్లిబఠాని.కామ్ తరపున కోరుకుంటూ ఆయన దశాబ్ద సినీ ప్రస్థానం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.