థియేటర్లలో దివ్యమణికి మంచి రెస్పాన్స్

 మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై గిరిధర్ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "దివ్య మణి".  ప్రముఖ యోగా గురు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా ,వైశాలి, కిమయా హీరొయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని గిరిధర్ గోపాల్ స్వయంగా నిర్మించడం విశేషం. ఇవాళ విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటోంది. 

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు సురేష్ కమల్, కథానాయకి కియమ, మరియు దర్శకుడు గిరిధర్ గోపాల్ హైద్రాబాద్ లోని థియేటర్లని విజిట్ చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ.. "ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రియలిస్టిక్ ఫైట్ సీక్వెన్స్ లను ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. మాస్ ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేయడం చూసి మాకు చాలా సంతోషం కలిగింది. మా హీరో సురేష్ కమల్ పడిన కష్టానికి తగిన ఫలితం లభించింది" అన్నారు. 

ఈ చిత్రానికి మాటలు: బలభద్రపాత్రుని రమణి, సినిమాటోగ్రఫీ: రాజేష్ కాటా, పైట్స్: జైక (థాయ్ లాండ్), రామ్ లక్ష్మణ్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్, కధ- దర్శకత్వం : గిరిధర్ గోపాల్.