పెళ్లిసందడి: రేపే అంగరంగ వైభవంగా సురేష్‌రైనా మ్యారేజ్

భారత క్రికెట్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సురేష్‌రైనా ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైంది. రైనా వివాహం తన చిన్నినాటి స్నేహితురాలైన ప్రియాoక చౌదరీతో శుక్రవారం జరగనుంది. ఇక్కడ పేరున్న హోటళ్లో అంగరంగ వైభవంగా జరిగే ఈ వివాహానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

ప్రియాoక రైనా బాల్య స్నేహితురాలు. ఆమె ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్‌లో రైనా విశేషంగా రాణించాడు. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఉన్న స్నేహం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరికి వివాహం చేసేందుకు నిశ్చయించారు.