అమెరికా విద్యార్థుల వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ లేఖ

గత నెల 6వ తేదన తెలుగు విద్యార్దులను వెనక్కి పంపడంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ కి పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు రాసిన లేఖకి సమాధానం వచ్చింది. విద్యార్దుల డిపోర్టేషన్ పైన అమెరికా అధికారులతో కేంద్రం సంప్రదింపులు జరుతుపున్నదని సుష్మాస్వరాజ్ తెలిపారు. డీల్లీతోపాటు అమెరికాలోని అధికారులతోనూ చర్చించి చట్టబద్దంగా వీసా కలిగిన వారిని తిరిగి పంపించవద్దని కోరినట్టు తెలిపారు. విద్యార్దులకి విమానాశ్రాయంలో ఏదురైన ఇబ్బందులపైన అమెరికా అధికారులు విచారం వ్యక్తం చేశారని, ఇకపై ఇమ్మిగ్రేషన్ అధికారులను తనీఖీల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తారని హమీ ఇచ్చారని మంత్రికి సుష్మస్వారాజ్ చెప్పారు..ఇప్పటికే విదేశాంగ శాఖ తరపున రెండు సార్లు తగిన సూచనలను విడుదల చేశామన్నారు. విద్యార్దులు ప్రవేశాలు తీసుకునే విద్యాసంస్ధల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని ధృవపత్రాలు తీసుకెళ్లాలని సూచించారు..అమెరికా వెళ్లాలనుకునే విద్యార్దులకి విద్యాసంస్ధలు, కోర్సుల విషయంలో ఏవైనా అనుమానాలుంటే దేశంలో ఉన్న ఏడు సహయ కేంద్రాల్లోని అమెరికా అధికారులను కలవచ్చని సుష్మస్వారాజ్ చెప్పారు… ఇక ఈ విషయంలో విద్యార్దులను అవగాహన కల్పించడంలో రాష్ర్టప్రభుత్వం క్రీయాశీలకంగా వ్యవహరించాలని మంత్రికి సూచించారు. విద్యార్దుల విషయంలో రెండు రాష్ర్టాలతో విదేశాంగ శాఖ టచ్ లో ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర విదేశాంగా శాఖాదికారులు ప్రభుత్వాలకు వివరణ ఇచ్చాయని తెలిపారు..విద్యార్దుల న్యాయమైన హక్కులకోసం విదేశాంగశాఖ సహకారం అందిస్తుందని విదేశాంగశాఖ తరపున సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు.