ఏప్రిల్ 26న స్వయంవద గ్రాండ్ రిలీజ్

చంద్రముఖిని గుర్తుకుతెచ్చేలా…

హారర్ చిత్రాల ట్రెండ్ ను దక్షిణాది చిత్ర పరిశ్రమల్లోకి తిరిగి తీసుకొచ్చిన సినిమా చంద్రముఖి. ఈ సినిమా సాధించిన ఘన విజయం మరెన్నో కొత్త హారర్ చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ క్రమంలో చంద్రముఖిని గుర్తుకుతెచ్చేలా రూపొందిన కొత్త సినిమా స్వయంవద. ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటించారు. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించారు. సకుటుంబ కథా చిత్రంగా స్వయంవదను దర్శకుడు వివేక్ వర్మ తెరకెక్కించారు. సస్పెన్స్, హారర్, కామెడీ థ్రిల్లర్ తరహాలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ…స్వయంవద లాంటి మంచి టైటిల్ పెట్టినందుకే చాలా మంది అభినందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూసిన వాళ్లంతా బాగుందని చెబుతున్నారు. రేపు సినిమా చూశాక కూడా ఇలాంటి ప్రశంసలే వస్తాయని ఆశిస్తున్నాం. ఇదొక విశిష్టమైన కథ. నాయిక పాత్ర ఆరు విభిన్న గెటప్ లలో కనిపిస్తుంది. ప్రేక్షకులు మెచ్చే హారర్, థ్రిల్లర్, కామెడీ లాంటి అన్ని అంశాలుంటాయి. కీలక పాత్రల్లో పేరున్న నటులు ప్రతిభావంతంగా నటించారు. సకుటుంబంగా చూసేలా ఎలాంటి ఇబ్బంది లేకుండా కథనం సాగుతుంది. గతంలో మనల్ని అలరించిన చంద్రముఖి చిత్రాన్ని గుర్తుకుతెచ్చేలా స్వయంవద ఉంటుంది. త్వరలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించి…ఏప్రిల్ 26న మా సినిమాను అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అన్నారు.

అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృష్ణ ముర‌ళి, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌, సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: మోహ‌న్ జిల్లా, కెమెరా: వేణు ముర‌ళీధ‌ర్.వి, సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, నిర్మాత‌: రాజా దూర్వాసుల‌, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌.