సస్పెన్స్, హారర్ , కామెడీ థ్రిల్లర్ స్వయంవద ట్రైలర్ కు అపూర్వ స్పందన..

స్వయంవద ట్రైలర్ కు అపూర్వ స్పందన..

ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా నటించిన చిత్రం స్వయంవద. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా దూర్వాసుల నిర్మించారు. ఈ చిత్రాన్ని దర్శకులు వివేక్ వర్మ తెరకెక్కించారు. జానపద కథల్లోని ఓ ఆసక్తికర నేపథ్యాన్ని ఎంచుకుని ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా స్వయంవద చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకులు వివేక్ వర్మ. సస్పెన్స్, హారర్ , కామెడీ థ్రిల్లర్ లాంటి అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన స్వయంవద ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి ఆవిష్కరించిన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. సినిమా మీద ఆసక్తి కలిగించేలా ట్రైలర్ ఉందన్న స్పందన వస్తోంది. ట్రైలర్ కు మంచి ఆదరణ రావడంపై చిత్ర నిర్మాత రాజా దూర్వాసుల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ…జానపద కథల్లో ఉండే నాటకీయత, వాస్తవికత మరే కథల్లో ఉండదు. అలాంటి కథల్లో ఒకదాన్ని ఎంచుకుని మన సినిమా తరహాకు మార్చారు దర్శకులు వివేక్ వర్మ. ప్రేక్షకులకు నచ్చే వాణిజ్య అంశాలన్నీ చేర్చి ఆసక్తికరంగా స్వయంవద చిత్రాన్ని మలిచారు. అందుకే మా సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అత్యధిక వ్యూస్ అందుకుంటోంది. రేపు సినిమాకూ ఇలాంటి ఫలితాన్నే ఆశిస్తున్నాం. ఆత్మగౌరవం కోసం స్వయంవద అనే యువతి చేసే పోరాటమే ఈ సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. ఏప్రిల్ 26న స్వయంవద చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అన్నారు.

అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృష్ణ ముర‌ళి, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌, సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: మోహ‌న్ జిల్లా, కెమెరా: వేణు ముర‌ళీధ‌ర్.వి, సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, నిర్మాత‌: రాజా దూర్వాసుల‌, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌.