నాపై రేప్ జరగలేదు.. అదో గుణపాఠం: శ్వేతాబసు ప్రసాద్

వ్యభిచారం కేసులో ఇరుక్కుని రెస్క్యూ గృహంలో ఉండి బయటకు వచ్చిన శ్వేతబసు ప్రసాద్ ఆమెపై వస్తున్న వార్తలకు ఘాటుగా స్పందించింది. తనను ఎవరూ జాలిగా చూడాల్సిన అవసరం లేదని తనపై రేప్ ఏమీ జరగలేదని చెప్పింది. తనపై జాలి చూపాల్సిన అవసరం లేదని… ఈ సంఘటనతో తాను ఎంతో గుణపాఠం నేర్చుకున్నానని కూడా చెప్పింది. అలాంటి కష్టాలను దాటి వచ్చిన తనకు ఎంతో మనోధైర్యం వచ్చిందని శ్వేత పేర్కొంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ప్రాజెక్టులో అవకాశం గురించి స్పందించమని అడిగితే తనకు ఏ ప్రాజెక్టులో అవకాశం వచ్చినా నటిస్తానని…తాను సొంత టాలెంట్‌తో అవకాశాలు రప్పించుకుంటానంది. చివరగా తాను రూట్స్ అనే డాక్యుమెంటరీపై పని చేస్తున్నానని.. ఇది క్లాసికల్ మ్యూజిక్‌కు సంబంధించిన డాక్యుమెంటరీ అని ముగించింది.