హాట్ గా శ్వేతాబసు ఐటం సాంగ్

స్పైసీ క్రియేషన్స్ మరియు శ్రీ చేజర్లమ్మ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఇంటిలిజంట్ ఇడియట్స్ చిత్రంలోని ముందుకు చూడు…వెనకకుచూడు… అనే స్పెషల్ సాంగ్ లో శ్వేతా బసు ప్రసాద్ నటించారు.

ఈ పాటకు కె.సి.మౌళి స్వరాలు సమకూర్చగా, సాహిత్యాన్ని శ్రీహరి మంగళంపల్లి అందించారు. 

భాను మాస్టర్ కొరియోగ్రఫి అందించిన ఈ పాట కుర్రకారుని ఊపేస్తుందని శ్వేతా బసు ప్రసాద్ తెలియచేశారు. 

నిర్మాతల్లో ఒకరైన శ్రీహరి మాట్లాడుతూ… చిత్రీకరణ మొత్తం పూర్తయిందని మే చివరి వారంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ… యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సినిమాని తీర్చిదిద్దామని సప్తగిరి, షకలక శంకర్ మరియు పోసాని కృష్ణమురళి కామెడీ హైలైట్ గా నిలుస్తుందని తెలిపారు. 

For More Images, Please Visit :

http://www.pallibatani.com/album-view-939-hot-shwetha-basu-prasad.html