మ్యాగ్జిమా మ‌జాకా.. తాప్సీకి అవ‌కాశాల వెల్లువ‌..

మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ పై తాప్సీ అందాలు ఆర‌బోసిన ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చి 48 గంట‌లు గ‌డ‌వ‌లేదు. అప్పుడే తాప్సీకి అవ‌కాశాలు త‌లుపు తడుతున్నాయి. ఏడాదిగా అవ‌కాశాల్లేక అల్లాడిపోతున్న ఈ భామ‌.. ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కినిలా అందాల అస్త్రాన్ని ప్ర‌యోగించింది. అది కాస్తా క‌రెక్ట్ గా వెళ్లి నిర్మాత‌ల గుండెల్లో గుచ్చుకుంది. అంతే.. తాప్సీ తాప్సీ అంటూ వ‌చ్చేస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రొస్తారు అని వేచి చూసిన ఈ భామ‌.. ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశాల‌ను చూసి మురిసిపోతుంది.

ప్ర‌స్తుతం తెలుగులో రానా హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఘాజీ సినిమాలో తాప్సీ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నుంది. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో పాకిస్థాన్ ఇండియాపై వాడిన ఓ జ‌లాంత‌ర్గామి పేరు ఘాజీ. ఆ నేప‌థ్యాన్ని తీసుకుని ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు సంక‌ల్ప్. ఇక బాలీవుడ్ లో ఇప్ప‌టికే విడుద‌ల కాని ర‌న్నింగ్ షాది డాట్ కామ్ ఇంకా తాప్సీ ఆశ‌ల్ని మోస్తుంది. దీంతోపాటు మ‌రో సినిమా కూడా అలాగే విడుద‌ల కాకుండా ఆగిపోయింది.
ఇలాంటి టైమ్ లో మ‌రో రెండు బంప‌ర్ ఆఫ‌ర్లు తాప్సీ తలుపు త‌ట్టాయి. అమితాబ్ హీరోగా జాతీయ అవార్డ్ గ్ర‌హీత అనిరుధ్ రాయ్ చౌద‌రి తెర‌కెక్కించ‌బోయే చిత్రంలో తాప్సీ ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఇందులో ఢిల్లీ అమ్మాయిగా క‌నిపించ‌నుంది తాప్సీ. నిజంగానే ఢిల్లీ బేబీ కావ‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తాప్సీ వైపు మొగ్గుచూపారు. ఇక క‌త్తి హిందీ రీమేక్ లోనూ తాప్సీ హీరోయిన్ గా న‌టించ‌నుంది. అక్ష‌య్ కుమార్ హీరోగా తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని మురుగ‌దాస్ రూపొందించ‌నున్నారు. వీటిలో ఏ రెండు సినిమాలు హిట్టైనా తాప్సీ కెరీర్ మ‌ళ్లీ వెలిగిపోవ‌డం ఖాయం.