చంద్రబాబు-పవన్ ఎవరొస్తారు…నేను రెఢీ..సనత్‌నగర్‌లో తలసాని సవాల్

సనత్‌నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఎవరొచ్చినా పోటీకి తాను రెఢీగా ఉన్నానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన వారు రాజకీయ సన్యానం చేయాలని ఆయన తెలిపారు.

ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను పోటీకి రెఢీగా ఉన్నానన్నారు. భారీ మెజార్టీతో గెలిచి తాను సత్తా చాటతానన్నారు. టీడీపీ నేతలు తలసానిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ సవాల్ విసిరారు.

గత ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన తలసాని తర్వాత తెరాసలో చేరి మంత్రి పదవి చేపట్టారు. తర్వాత కాలంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇది గవర్నర్ పరిశీలనలో ఉంది. గవర్నర్ తలసాని రాజీనామా ఆమోదిస్తే సనత్‌నగర్‌కు ఉప ఎన్నిక జరుగుతుంది.