బాలయ్య సినిమాను కాఫీ కొడుతున్న టాప్‌హీరో

యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా అప్పట్లో టాలీవుడ్‌లో ఓ సంచలనం. బాలయ్య చేసిన రెండు పాత్రలు ఇప్పటకి ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతుంటాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 939 అనే సినిమాను ఆయన ఎనౌన్స్ చేసినా కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. 

ఇప్పుడు ఇదే స్టోరీతో కోలీవుడ్‌లో ఓ సినిమా వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ టాప్ హీరో విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో వస్తున్న పులి సినిమా స్టోరీ లైన్, ఆదిత్య-369 స్టోరీలైన్ ఇంచుమించు దగ్గరగా ఉంటాయన్న వార్తలు వస్తున్నాయి.

సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. మరుగుజ్జుగా, యువరాజుగా, ఆధునిక యువకుడిగా నటిస్తున్నాడు. శృతీహాసన్, హన్సిక కథానాయికలు. అందాల తార శ్రీదేవి మహారాణి పాత్రలో సుదీప్‌కు జోడీగా నటిస్తోంది. సుదీప్‌తో శ్రీదేవి లిప్ లాక్ సీన్ కూడా ఉంటుందని సమాచారం. 

రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.