హుదూద్ బాధితులకు కోలీవుడ్ చేయూత

ఏపీని వణికించిన హుదూద్ తుపాను బాధితులకు కోలీవుడ్ హీరోలు కూడా విరాళం ఇచ్చి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. కోలీవుడ్ హీరోల సినిమాలకు కూడా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. భాష, ప్రాంతం వేరైనా బాధ అన్నది ఎవ్వరికైనా ఒక్కటేనని వారు భావించి వెంటనే స్పందించారు. హీరో సూర్య, కార్తీ సోదరుల సినిమాలకు ఇక్కడ ఎంత డిమాండ్ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. తుపాన్‌త ఏపీ అతలాకుతలం అయ్యిందని తెలుసుకున్న సూర్య ఫ్యామిలీ రూ.50 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టు ప్రకటించింది. సూర్య రూ.25 లక్షలు, కార్తీ రూ 12.5 లక్షలు, నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ 12.5 లక్షలను విరాళంగా ప్రకటించారు.

ఇక తెలుగు వాడైనా తమిళ సినిమాలతో పేరు తెచ్చుకుని టాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకున్న విశాల్‌కృష్ణ కూడా తన వంతు సాయంగా బాధితులకు రూ.15 లక్షల విరాళం ప్రకటించాడు. ప్రకాష్‌రాజ్ తన వంతు సాయంగా రూ.5 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. ఏదేమైనా ఏపీలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ హీరోలు కూడా కదిలిరావడం నిజంగా అభినందిచదగిన విషయం.