క్రికెటర్ బయోపిక్ లో తాప్సీ….

న‌న్ను ద‌క్షిణాది ద‌ర్శ‌కులు కేవ‌లం గ్లామ‌ర్ డాల్ గానే చూసారు.. నాలో ఉన్న న‌టిని వాళ్లు చూడ‌లేక‌పోయారు.. ఎంత‌సేపూ కేవ‌లం అందాల ఆర‌బోత‌కే న‌న్ను ప‌రిమితం చేసారు.. అందుకే నాకు ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ అంటే పెద్ద‌గా ఇష్ట‌ముండ‌దు.. ఇవి కొన్నేళ్ల కింద తాప్సీ తెలుగు ఇండ‌స్ట్రీపై చేసిన కామెంట్స్. అప్పుడు ఈ మాట‌లు విని అంతా కోప్ప‌డ్డారు.. కాస్త క్రేజ్ వ‌చ్చిన త‌ర్వాత పేరు తెచ్చిన ఇండ‌స్ట్రీని సైతం ఈమె తిట్టేసి వెళ్లిపోయింది అంటూ విమ‌ర్శించారు. కానీ ఇప్పుడు తాప్సీ చేస్తున్న పాత్ర‌లు.. ఆమె ఎంచుకుంటున్న క‌థ‌లు చూసిన త‌ర్వాత ఏమో ఆమె చెప్పిందే నిజ‌మేమో అనిపించ‌క మాన‌దు. నిజ‌మే.. ఆమె సౌత్ లో ఉన్న‌పుడు ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఛాలెంజింగ్ రోల్ ఇవ్వ‌లేదు. కానీ హిందీకి వెళ్లిన త‌ర్వాత ఆమె నుంచి బేబీ.. పింక్.. గేమ్ ఓవ‌ర్ లాంటి సినిమాలు వ‌చ్చాయి.
మ‌ధ్య‌లో జుడ్వా 2 లాంటి గ్లామ‌ర‌స్ సినిమాలు కూడా వ‌చ్చినా ఎక్కువ భాగం న‌ట‌న‌కు ప‌రిమిత‌మైన పాత్ర‌లే చేస్తూ వ‌చ్చింది తాప్సీ. ఇక ఇప్పుడు ఇండియ‌న్ ఉమెన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ బ‌యోపిక్ లో న‌టించ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. దీనిపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా త్వ‌ర‌లోనే రానుంది. తాప్సీ కూడా ఈ పాత్ర‌పై ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తుంది. హైద‌రాబాద్ నుంచే ఇండియాకు ఆడింది మిథాలి. మెన్స్ క్రికెట్ లో స‌చిన్ ఎన్ని రికార్డులు సాధించాడో.. ఉమెన్ క్రికెట్ లో మిథాలి కూడా అదే మాదిరిగా అన్ని రికార్డుల‌కు తెర‌తీసింది. ఈమె బ‌యోపిక్ అంటే క‌చ్చితంగా ఆస‌క్తిక‌రంగా ఉండ‌టం ఖాయం. మ‌రి చూడాలిక‌.. తాప్సీ ఈ పాత్ర‌లో ఏం మాయ చేయ‌బోతుందో..?