20-20లో జింబాబ్వే చిత్తు…ఆగ‌ని భార‌త్ జోరు

జింబాబ్వే టూర్‌లో భార‌త్ అద‌ర‌గొడుతోంది. మూడు వన్డేల సీరిస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా అదే ఊపులో రెండు 20-20 సీరీస్‌లో భాగంగా హ‌రారేలో శుక్ర‌వారం జ‌రిగిన తొలి మ్యాచ్‌లో ఆధిత్య జింబాబ్వేను 54 ప‌రుగుల తేడాతో ఓడించి 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేసింది. భార‌త జ‌ట్టులో ఓపెన‌ర్లు ర‌హానే(33), ముర‌ళీ విజ‌య్ (34) మంచి ప్రారంభం ఇచ్చారు. చివ‌ర్లో ఊత‌ప్ప‌(39 నాటౌట్‌) రాణించ‌డంతో భార‌త్ గౌర‌వ‌ప్ర‌ద స్కోరు సాధించింది.

179 ప‌రుగులు విజ‌య‌ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు న‌ష్ట‌పోయి 124 ప‌రుగులు సాధించింది. ఓపెన‌ర్లు మ‌స‌క‌జ్జ‌(28), చిబాబా (23) మిన‌హా ఎవ్వ‌రు చెప్పుకోద‌గిన ప‌రుగులు చేయ‌లేక‌పోవ‌డంతో జింబాబ్వే కేవ‌లం 124 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య చివ‌రిదైన రెండో వ‌న్డే ఆదివారం (జూలై20న‌) జ‌రుగుతుంది. భార‌త బౌల‌ర్ల‌లో అక్ష‌ర్‌ప‌టేల్ మూడు, హ‌ర్భ‌జ‌న్ రెండు, మెహిత్‌శ‌ర్మ వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు 3 వికెట్లు తీసిన అక్ష‌ర్‌ప‌టేల్‌కు ద‌క్కింది.