బాలయ్యపై తెలంగాణ మంత్రి ప్రశంసల జల్లు

సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణపై తెలంగాణ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రశంసల వర్షం కురిపించారు. రొమ్ముక్యాన్సరపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బసవతారకం ఇండోక్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ కేబీఆర్ పార్కు ఆధ్వర్యంలో రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తన తల్లి నందమూరి బసవతారకం క్యాన్సర్‌తో బాధపడ్డారని వేరెవ్వరు పడకూడదనే ఉద్ధేశ్యంతోనే ప్రపంచ స్థాయి వసతులతో ఆసుపత్రి ప్రారంభించామన్నారు.


బాలయ్యపై రాజయ్య ప్రశంసల వర్షం:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ ఆసుపత్రి కోసం బాలకృష్ణ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. సినిమాల్లో డాక్టర్ పాత్రలు తక్కువగానే చేసిన బాలయ్య నిజజీవితంలో మాత్రం డాక్టర్లా ప్రజలకు సేవలందిస్తున్నారని కొనియాడారు. ఆయన క్యాన్సర్ రహిత సమాజం ఏర్పాటు చేయాలనే ఒక ఆశయంతో పని చేస్తున్నారని ప్రశంసించారు.