తెలంగాణ రైతుల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్

తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకునేందుకు తెలుగుదేశం నడుంకట్టింది. అక్కడ ఎన్టీఆర్ రైతు సంక్షేమనిధిని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ తేదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. రూ.2 కోట్లతో ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ నిధికి దాతల నుంచి విరాళాలు కూడా సేకరిస్తామన్నారు. ఎవరైనా విరాళాలు ఇవ్వవచ్చని ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ జీవించి ఉన్నంతకాలం తెలంగాణపై అనంతప్రేమ చాటేవారని ఆయన చెప్పారు. ఆయన స్మృతికి గుర్తుగా ఆయన పేరుతో ఎన్టీఆర్ రైతుసంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 

ఇక ఇటీవల తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులను బస్సుయాత్ర ద్వారా పరామర్శించిన తేదేపా నేతలు ఇప్పుడు ఒక్కోబాధిత రైతు కుటుంబానికి రూ.50వేల ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంతో తెలుగుదేశం తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటకీ కొలువై ఉంటారన్న సందేశం పంపడంతో పాటు అక్కడ బలోపేతం చేసేందుకు కార్యచరణ రూపొందించేలా ప్లాన్ వేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.