టెంపర్ హిట్‌కు కళ్యాణ్‌రామ్, దిల్ రాజు సెంటిమెంట్ స్టోరీలు

టెంపర్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది… ఇందులో సందేహం లేదని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్‌రామ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండు సెంటిమెంట్లు చెప్పారు. కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ పటాస్, టెంపర్, లయన్ ఇలా ఈ మూడు సినిమాల్లోను మూడక్షరాలే ఉన్నాయని.. పటాస్ ముందు ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని… ఇప్పుడు టెంపర్… తర్వాత లయన్ ఇలా ఈ మూడు సినిమాల్లు హిట్ అవుతాయని సెంటిమెంట్ కథ చెప్పారు. ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా మిగిలిపోతుందని కళ్యాణ్ ఉద్విఘ్నంగా చెప్పారు.

టాప్ ప్రొడ్యుసర్ దిల్ రాజు మాట్లాడుతూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో వచ్చిన బృందావనం, బాద్ షా ఇప్పటికే హిట్ కొట్టాయని టెంపర్ వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ అవుతుందని తెలిపారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 13న సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా ఎత్తున రిలీజ్ చేయనున్నారు.