తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన టి ఎఫ్ జె ఏ

జర్నలిస్టులకు హెల్త్ కార్డ్స్ మంజూరు చేసినందుకు తెలంగాణా ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి కె సి ఆర్ కు కృతజ్ఞ్యతలు తెలిపింది. అక్రిడేషన్ లతో పాటు తెలంగాణాలో ఉన్న జర్నలిస్టులందరికి హెల్త్ కార్డ్ ఇవ్వడం పట్ల ఫిలిం జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. అక్రిడేషన్ లేని వారికి సైతం హెల్త్ కార్డ్ లు ఇవ్వడానికి అంగీకరించిన ముఖ్యమంత్రికి టి ఎఫ్ జె ఎ గౌరవ అధ్యక్షులు నారాయణ రాజు, అధ్యక్షుడు మసాడే. లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్, కార్యదర్శులు మదూరి మధు, చిన్నమూల రమేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మి నారాయణతో పాటు సభ్యులంతా ధన్యవాదాలు తెలిపారు.

వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ళ నిర్మాణం కూడా త్వరగా చేపట్టాలని…. ముఖ్యంగా ఫిలిం జర్నలిస్టులు అందరూ పేద కుటుంబాల నుంచి వచ్చినవారే కావడం… వీరికి వివిధ మీడియా కార్యాలయాల్లో ఇచ్చే జీతం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సినిమా కార్మికులకు చిత్రపురి కాలనీలో ఇళ్ళ నిర్మాణం చేసినట్టు ఫిలిం జర్నలిస్టులకు ఫిలిం నగర్ లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.