హిప్ మూవ్ మెంట్స్ తో పడగొట్టేశా – తిక్క మూవీ హీరోయన్ లారిస్సా

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఎంత ఉందో స్పష్టంగా అర్థమౌతోంది. దాదాపు 20 కోట్లతో తెరకెక్కించిన తిక్క చిత్రం కోసం బ్రెజిల్ మోడల్ ను హీరోయిన్ గా తీసుకొచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే క్యారెక్టర్ పరంగా లారిస్సా సరిగ్గా సరిపోయిందని చిత్ర యూనిట్ అంటోంది. లారిస్సా సైతం డైలాగ్స్ నేర్చుకొని సీన్స్ అర్థం చేసుకొని బాగా నటించానని చెబుతోంది. తిక్క చిత్రం గురించి లారిస్సా మాట్లాడుతూ…

నాది బ్రెజిల్. చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాను. ఓ యాడ్ ఫిల్మ్ లో చూసిన నిర్మాత రోహిన్ రెడ్డి సంప్రదించారు. నాకు క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఓకే చేశాను. ఈ సినిమా ద్వారా నేను తెలుగులో ఇంట్రడ్యూస్ కావడం చాలా సంతోషంగా ఉంది. మంచి ప్రొడక్షన్ కంపెనీ ఇది. దర్శకుడు సునీల్ రెడ్డి చాలా క్లారిటీతో ఉండేవాడు. ప్రతీ సీన్ ను చక్కగా వివరించేవారు. నాకు భాష తెలియకపోయినా సరే… పెర్ ఫార్మెన్స్ వచ్చే వరకు చేయించేవారు. ఇక హీరో సాయి సూపర్ కూల్ పర్సన్. నేను సరిగ్గా చేయకపోతే బాగా ఎంకరేజ్ చేసేవారు. అతని డ్యాన్స్ కి నేను ఫిదా అయ్యాను. ఆయనతో డ్యాన్స్ చేయడం చాలా కష్టం. ఆయన స్టెప్పులతో మెస్మరైజ్ చేశాడు. నేను రన్నింగ్, హిప్ మూవ్ మెంట్స్ చేశాను. నాకు ఇందులో రెండు పాటలున్నాయి. మన్నార చోప్రాతో మంచి సీన్స్ ఉన్నాయి. ముమైత్ ఖాన్ మంచి ఫ్రెండ్ అయ్యింది. ఇందులో కామెడీ సూపర్బ్ గా ఉంటుంది. రఘు బాబు గారి కామెడీకి బాగా నవ్వుతారు. నేను ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగుతో పాటు బాలీవుడ్ మూవీస్ చేయాలని ఉంది. హిందీ కూడా నేర్చుకుంటున్నాను.