అయ్య‌బాబోయ్.. ఏంటి తిక్క‌..?

తిక్క‌.. ఈ టైటిల్ విన్న‌పుడే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈ టైటిల్ ఎందుకు పెట్టార‌బ్బా అనుకున్నోళ్ల‌కు తిక్క ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిధ‌రంతేజ్ చేసిన సినిమాల్లో తిక్క చాలా వెరైటీ సినిమా. కిక్ కు అమ్మ‌మ్మ‌లా ఉంది ఈ సినిమా ట్రైల‌ర్. కిక్ లో ర‌వితేజ చేసే ప‌నుల‌కు లాజిక్ ఉండ‌దు.. అనుకున్న‌ది చేస్తూ పోవ‌డ‌మే. ఇక్క‌డ తిక్క ట్రైల‌ర్ లో సాయి దానికంటే వంద రెట్లు ఎక్కువ‌గా ఉన్నాడు. హైపర్ యాక్ష‌న్ తో ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తూ తిక్క పుట్టించేసాడు.

ట్రైల‌ర్ చూస్తుంటే సినిమాలో ఏదో ఉంద‌నే విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంది. కానీ క‌థేంటో లీక్ చేయ‌కుండా ప్రేక్ష‌కుల ఊహ‌ల్ని లాక్ చేసాడు ద‌ర్శ‌కుడు సునీల్ రెడ్డి. ఈయ‌న తొలి సినిమా ఓం సైతం ఇలాగే పక‌డ్బందీ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఆ సినిమా ఫ్లాపైనా.. అందులో ద‌ర్శ‌కత్వ ప్ర‌తిభ‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక మూడేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు సుప్రీమ్ హీరో సాయిధ‌రంతేజ్ తో సినిమా చేస్తున్నాడు సునీల్ రెడ్డి. ఈ సినిమాపై ముందు ఎవ్వ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు.. కానీ ఇప్పుడు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై క‌చ్చితంగా ఆస‌క్తి రెట్టింపు అవుతుంది. మొత్తానికి మ‌రి ఈ తిక్క సినిమా సాయికి హ్యాట్రిక్ తీసుకొస్తుందో లేదో చూడాలి.