తోలుబొమ్మలాట మూవీ రివ్యూ

తోలుబొమ్మలాట మూవీ రివ్యూ

రాజేంద్రప్రసాద్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ఇప్పటికీ మెప్పిస్తున్నారు. ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా రూపొందిన చిత్రమే తోలుబొమ్మలాట. డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ తదితరులు. ముఖ్య పాత్రలు పోషించారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకుడు.  దుర్గాప్రసాద్‌ మాగంటి నిర్మాత. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథేంటంటే….
సోడాల రాజు అలియాస్ సోమరాజు (రాజేంద్ర ప్రసాద్) తన గ్రామంలోనే అందరీ మంచి కోరుకునే సుప్రసిద్ధమైన పెద్ద మనిషి. అయితే సోమరాజుకు తన మనవరాలు వర్ష (హర్షిత) మరియు తన మనవడు రిషి (విశ్వంత్‌) పెళ్లి చేసుకోవాలని.. అలాగే తన పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని.. జీవితంలో ఆయన బలంగా కోరుకున్న చివరి కోరిక. సోమరాజు తన కోరికను నెరవేర్చుకునే క్రమంలో కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అకస్మాత్తుగా సోమరాజు చనిపోతాడు. అయినప్పటికీ ఆ తరువాత మళ్లీ ఒక ఆత్మగా తిరిగి వస్తాడు. కానీ అప్పటికే తన పిల్లల ఆస్తి పై గొడవలు పడుతుంటారు. అలా వారి నిజస్వరూపాలు చూస్తాడు సోమరాజు. అవి చూస్తూ సోమరాజు ఎలాంటి బాధ పడ్డాడు ? తిరిగి తన పిల్లలను ఎలా మార్చాలకున్నాడు ? దాని కోసం ఏమి చేశాడు ? ఎవరి సహాయం తీసుకున్నాడు ? చివరికీ సోమరాజూ పిలల్లు మారారా ? లేదా ?

సమీక్ష…

ఒక కుటుంబంలోని మూడు తరాల పెద్దగా పిల్లల సంతోషమే తన చివరి కోరికగా నిలిచే ప్రధాన పాత్ర ‘సోమరాజు’ పాత్ర మనకు ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. ఆ వయసు గల ప్రతి వ్యక్తికీ సోమరాజు పాత్ర కనెక్ట్ అవుతుంది. అలాగే చిన్న చిన్న విషయాలకే కుంటుంబాల మధ్య ఏర్పడే అపోహలను అపార్థాలను దర్శకుడు చాల చక్కగా చూపించాడు. మళ్లీ అంతలోనే ఆ పాత్రల మధ్యనే కన్నీళ్లను మరియు అభిమానాలతో కూడుకున్న ఆత్మాభిమానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మొత్తానికి సినిమాలో కుటుంబ భావోద్వేగాలు బాగున్నాయి. నేటి తరం డబ్బు కోసం వారి అవసరాల కోసం ఎలా మారతారు అనే కోణాన్ని కూడా బాగా చూపించారు. ఇక రాజేంద్ర ప్రసాద్ మరియు అతని పిల్లల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి.. రాజేంద్ర ప్రసాద్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో మరోసారి మంచి పాత్రలో కనిపించాడు. సినిమాలోని కోర్ ఎమోషన్ని ఆయన తన హావభావాలతోనే పలికించే ప్రయత్నం చేశారు. ఇక ఈ చిత్రానికి మరో ప్రధాన పాత్ర వెన్నెలా కిషోర్ ది. సినిమా మొత్తం కనిపించే వెన్నెల కిషోర్ తన టైమింగ్ తో బాగానే నవ్వించాడు. దేవీ ప్రసాద్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో బాగా నటించారు. హీరోగా కనిపించిన విశ్వంత్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే హీరోయిన్ గా హర్షిత కూడా చాలా బాగా నటించింది. ధన్ రాజ్ కూడా మంచి పాత్రను పోషించాడు. ఇక నర్రా, శ్రీనివాస్‌ అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. కనుమరుగైపోతున్న మానవ సంబంధాల యెుక్క గొప్పతనాన్ని, మరియు తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను గుర్తు చేయాలని దర్శకుడు తీసుకున్న కథాంశం బాగుంది.

సెటప్, సీన్స్ మరియు స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్  చాలా క్లారిటీగా వున్నాడు. హీరోహీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్, ఆ ప్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. లవ్ అండ్ ఫ్యామిలీ సీన్స్ బాగున్నాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేశాడు.
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. విశ్వనాథ్‌ మాగంటి దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అందించిన పాటలు బాగున్నాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాగుంది. పెల్లెటూరు విజువల్స్ ను ఆయన చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాత దుర్గాప్రసాద్‌ మాగంటి పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.

‘తోలుబొమ్మలాట’  ఫ్యామిలీ ఎమోషన్స్‌ ను గుర్తుచేసే కథాంశంతో సాగిన ఈ చిత్రం.. కొన్ని కుటుంబ భావోద్వేగాలతో అలాగే వెన్నెల కిషోర్ తన కామెడీతో ఆకట్టుకుంది. అన్ని వర్గాల్ని మెపించే అంశాలు చాలా వున్నాయి కాబట్టి…. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5

.