పెళ్లి పీఠలెక్కనున్న ఇద్దరు టాలీవుడ్ హీరోలు

టాలీవుడ్‌లో మరో ఇద్దరు బ్యాచ్‌లర్ హీరోలు ఓ ఇంటి వారు కాబోతున్నారు. కలెక్షన్ కింగ్‌మంచు మోహన్‌బాబు వారసుడు మంచు మనోజ్ వివాహం అతడి ప్రియురాలు ప్రణతితో ఈ నెల 20న జరగనుంది.

ఇక దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడు, కామెడీ హీరో అల్లరి నరేష్ వివాహం ఈ నెల 29న జరగనుంది. కృష్ణా జిల్లాకు చెందిన, చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న యువతితో నరేష్ వివాహం జరగనుంది.

ఇక తాజాగా అందాల రాక్షసి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరో నవీన్‌చంద్ర వివాహం హైదరాబాద్‌కు చెందిన యువతితో త్వరలోనే జరగనున్నట్టు సమాచారం. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. నవీన్‌చంద్ర ప్రస్తుతం కలర్స్ స్వాతి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న త్రిపుర సినిమాలో నటిస్తున్నాడు.