హిట్టు మీద హిట్టు.. బాక్సాఫీస్ క‌ళ క‌ళ‌..

చూస్తుంటే ఇండ‌స్ట్రీ టైమ్ ట‌ర్న్ అయిన‌ట్లుంది. హిట్ మీద హిట్ కొడుతూ సెకండాఫ్ అంతా క‌ళ‌క‌ళ‌లాడుతుంది. తొలి ఆర్నెళ్ల‌లో ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్నినాయ‌నా, ఊపిరి, నాన్న‌కు ప్రేమ‌తో, స‌రైనోడు లాంటి సినిమాల‌న్నీ బాక్సాఫీస్ ను దున్నేసాయి. స‌ర్దార్, బ్ర‌హ్మోత్స‌వం లాంటి డిజాస్ట‌ర్ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ… ఆ తర్వాత వచ్చిన సినిమాలు సక్సెస్ లు సాధిస్తున్నాయి. నాని కృష్ణ‌గాడి వీరప్రేమ గాథ, జెంటిల్ మ‌న్ ల‌తో సూపర్ హిట్లు అందుకున్నాడు.

ముఖ్యంగా చిన్న సినిమాల‌న్నీ స‌త్తా చూపిస్తున్నాయి. బిచ్చగాడు అనే డబ్బింగ్ చిత్రం వంద రోజులకు పరుగులు తీస్తు ఇరవై కోట్లకు పైగా వసూళు చేసి రికార్డ్ సృష్టించింది. రెండు వారాల కింద వ‌చ్చిన పెళ్లిచూపులు వ‌సూళ్ళ‌లో అద్భుతాలు చేస్తోంది. ఇప్ప‌టికే 10 కోట్లకు చేరువ‌గా వ‌చ్చింది ఈ సినిమా. ఇంతా చేస్తే బ‌డ్జెట్ మాత్రం కోటిన్నర మాత్రమే. ఇక జ‌క్క‌న్న సైతం ఓపెనింగ్స్ ప‌ర్లేద‌నిపించింది. ఈ వారం వ‌చ్చిన శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు, మ‌న‌మంతా సినిమాలు కూడా మంచి వ‌సూళ్ల‌నే సాధిస్తున్నాయి. ముఖ్యంగా శిరీష్ ట్రాక్ రికార్డ్ తో ప‌నిలేకుండా శ్రీ‌ర‌స్తు వ‌సూళ్లు సాధిస్తుండ‌టం విశేషం. ఇదే ఊపులో బాబు బంగారం, తిక్క, జ‌న‌తా గ్యారేజ్, ధృవ లాంటి భారీ సినిమాలు కూడా హిట్టైతే 2016 చ‌రిత్ర‌లో మిగిలిపోవ‌డం ఖాయం.