టాలీవుడ్ స‌మ్మ‌ర్ బిజినెస్ 800 కోట్లు… లెట్స్ డూ కుమ్ముడు…

టాలీవుడ్‌లో సంక్రాంతి త‌ర్వాత సినిమాల‌కు మంచి సీజ‌న్ ఏదంటే ఖ‌చ్చితంగా స‌మ్మ‌ర్ సీజ‌నే. స‌మ్మ‌ర్‌లో యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా వ‌సూళ్ల దుమ్ము దులిపేస్తుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు గ‌తేడాది యావ‌రేజ్ టాక్‌తో స్టార్ట్ అయిన స‌రైనోడు, అ..ఆ, బిచ్చ‌గాడు సినిమాలు ఎలా వ‌సూళ్ల వీర‌విహారం చేశాయో చూశాం. ఇదే క్ర‌మంలో ఈ యేడాది కూడా టాలీవుడ్‌లో స‌మ్మ‌ర్ సీజ‌న్‌ను చాలా పెద్ద సినిమాలు టార్గెట్ చేశాయి.

ఓవ‌రాల్‌గా 2017 స‌మ్మ‌ర్‌కు టాలీవుడ్‌లో ఏకంగా రూ.700 కోట్ల బిజినెస్ జ‌రుగుతోన్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. టాలీవుడ్ స‌మ్మ‌ర్‌ను క్యాష్ చేసుకునేందుకు ముందుగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడుగా వ‌స్తున్నాడు. ఈ సినిమా 100 క్రోర్స్ క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో ఊపుమీదున్న శ‌ర్వానంద్ రాధాతో వ‌స్తున్నాడు.

ఇక ఏప్రిల్‌లో 7న విక్ట‌రీ వెంక‌టేష్ గురుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. అదే రోజు మ‌ణిర‌త్నం – కార్తీ మూవీ చెలియా వ‌స్తోంది. దిల్ రాజు చెలియాను రిలీజ్ చేస్తుండ‌డంతో ఈ సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది. ఇక అదే రోజు అల్లు శిరీష్ మ‌ళ‌యాళ మూవీ 1971 బెయాండ్ బోర్డర్స్ కు డబ్బింగ్ వెర్షన్ అయిన 1971 భారత సరిహద్దు కూడా విడుదల కానుంది. మంచి అంచ‌నాలు ఉన్న మూడు సినిమాలు ఒకే రోజు వ‌స్తుండ‌డంతో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌నున్నాయి.

ఇక ఏప్రిల్ 14 శ్రీను వైట్ల – వ‌రుణ్‌తేజ్ మిస్ట‌ర్ వ‌స్తోంది. ట్రైల‌ర్‌తో మిస్ట‌ర్‌పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీంతో పాటు అవసరాల శ్రీనివాస్ బాబు బాగా బిజీ కూడా వచ్చే అవకాశముంది. ఇక ఏప్రిల్ 28న ఇండియావైజ్‌గా అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న బాహుబ‌లి 2 వస్తోంది. ఈ ఒక్క సినిమానే 400 నుంచి 500 కోట్లు బిజినెస్ చేస్తుంద‌ని అంచ‌నా. బాహుబ‌లి 2 దాదాపు అన్ని థియేట‌ర్లు ఆక్ర‌మించేయ‌నుంది. బాహుబ‌లి 2 వ‌చ్చాక రెండు వారాల గ్యాప్ త‌ర్వాత నిఖిల్ కేశ‌వ మే 12న రిలీజ్ డేట్ బుక్ చేసుకుంది. ఇక క్రేజీ ఫిల్మ్ మహేష్ మురగాదాస్ సినిమా టార్గెట్ కూడా భారీగానే ఉంది. జూన్ 23న ఈ సినిమా రానుంది. ఇది కూడా వంద కోట్ల టార్గెట్ ఉన్న సినిమా

మే 19న అల్లు అర్జున్ – హ‌రీష్ శంక‌ర్ దువ్వాడ జ‌గ‌న్నాథం వ‌స్తోంది. ఈ సినిమా కూడా రూ.80 కోట్ల వ‌ర‌కు బిజినెస్ చేస్తుంద‌ని అంచ‌నా. ఇక వీటితో పాటు నాని సినిమా, వ‌రుణ్‌తేజ్ – శేఖ‌ర్ క‌మ్ముల ఫిదాతో పాటు మ‌రికొన్ని చిన్నా చిత‌కా సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. వీటితోపాటు.. ఇంకా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోని మీడియం బడ్జెట్ సినిమాలు, చిన్ని సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా బాహుబలి కంటే ముందే వచ్చే అవకాశముంది. ఇవ‌న్నీ క‌లుపుకుంటే ఓవ‌రాల్‌గా టాలీవుడ్ స‌మ్మ‌ర్ బిజినెస్ రూ.800 కోట్ల పై మాటే ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.