ఇండ‌స్ట్రీని భ‌య‌పెడుతున్న అగ్ర హీరోల వార్

టాలీవుడ్‌కు మూల స్తంభాల్లాంటి న‌లుగురు అగ్ర హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, యువ‌సామ్రాట్ అక్కినేని నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్ ఈ న‌లుగురు హీరోల మ‌ధ్య జ‌రుగుతున్న ఓ వార్ ఇప్పుడు టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఈ న‌లుగురు హీరోలు తొలిసారిగా అదిరిపోయే రేంజ్‌లో వార్‌కు రెడీ అవుతున్నారు. ఇంత‌కు ఈ న‌లుగురు హీరోల మ‌ధ్య ఆ గొడ‌వ ఏంటి..అందుకు రీజ‌న్ ఏంటో చూద్దాం.

టాలీవుడ్‌లో ఇటీవ‌ల ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రావ‌డం లేదు. ఇప్పుడు అంతా వ‌న్ వీక్ మ‌య‌మైపోయింది. దీంతో ఒకేసారి త‌మ సినిమాల‌ను ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే ఈ సంక్రాంతి నుంచి ఆ ట్రెండ్ మారింది. ఒకేసారి నాలుగు సినిమాలు వ‌చ్చి హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఒకేసారి రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ చేసేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే సంక్రాంతికి ఇప్ప‌టికే బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఈ రెండు సినిమాలు ముందే డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇక నాగార్జున ఈ సంక్రాంతికి సోగ్గాడేతో హిట్ కొట్ట‌డంతో ఇప్పుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఓం న‌మోవేంక‌టేశాయా సినిమాతో సంక్రాంతికే బ‌రిలో దిగుతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ఇక ఈ ముగ్గురు హీరోల‌తో పాటు విక్ట‌రీ వెంక‌టేష్ ‘గురు’ సినిమా కూడా సంక్రాంతికే రానుందని చెబుతున్నారు. ముందు డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నా, ఆ తరువాత సంక్రాంతికే వెళ్లాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.

శాత‌క‌ర్ణి-ఖైదీ నెంబ‌ర్ 150 – గురు సినిమాలు సంక్రాంతికి క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టే. మ‌రి నాగ్ న‌మో వేంక‌టేశాయ సినిమా కూడా సంక్రాంతికే వ‌స్తే ప్రేక్ష‌కుల‌కు నిజంగా సంక్రాంతే. అయితే ఈ న‌లుగురు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేట‌ర్ల యుద్ధం, ఇత‌ర‌త్రా ప‌రిణ‌మాలు ఎలా ఉంటాయో అన్న ఆస‌క్తి ఇండ‌స్ట్రీలో కాస్త టెన్ష‌న్‌గానే ఉంది.