రూల్స్ బ్రేక్ చేసిన న‌ల్సార్ : ట్రెండ్ సెట్ చేసిందంతే!

న‌ల్సార్ లా యూనివ‌ర్శిటీ న‌యా ట్రెండ్‌ను సెట్ చేసింది. దేశంలో ఏయూనివర్శిటీ చేయ‌ని విధంగా ఓ విద్యార్థికి ఇత‌ర విభాగంలో (ఆడ కాదు మ‌గా కాదు) డిగ్రీ ప‌ట్టా జారీ  చేసింది. లింగ నిర్థార‌ణ‌కు ఇష్ట‌ప‌డ‌ని ఓ విద్యార్థి అభ్య‌ర్థ‌న మేర‌కు ఎటువంటి ప్ర‌శ్న‌లు వేయ‌కుండా ఈ విధంగా డిగ్రీ జారీ చేసి వార్త‌ల్లో నిలిచింది. సాధార‌ణంగా ఉన్న‌త విద్య పూర్తి చేసుకున్న త‌రువాత జారీ చేసి స‌ర్టిఫికెట్ల‌లో ఆడ లేదా మ‌గ ఈ రెండింటిలో ఏదో ఒక ధ్రువీక‌ర‌ణ‌ను పేర్కొన‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. కానీ దీనిని బ్రేక్ చేస్తూ న‌ల్సార్ తొలి సారి ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకుంది.

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన అమిత్ దండా అనే విద్యార్థి త‌న కోర్సు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా త‌న‌కు ఇత‌ర (ఎంఎస్‌) విభాగంలో స‌ర్టిపికెట్ ఇవ్వాల‌ని కోరాడు. అందుకు అనుగుణంగా వ‌ర్శిటీ అధికారులు వ్య‌వ‌హ‌రించి, సామాజిక‌వేత్త‌ల అభినంద‌న‌లు అందుకున్నారు. దేశంలో ఇప్పుడిప్పుడే లింగ నిర్థాణ‌కు ఇష్ట‌ప‌డ‌ని వ్య‌క్తుల విష‌యంలో సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ థ‌ర్డ్ జండ‌ర్ కు ద‌క్కాల్సిన హ‌క్కులుపై చ‌ర్చ న‌డుస్తోంది. ఈ  త‌రుణంలో న‌ల్సార్ ఓ గొప్ప సంచ‌ల‌నానికి తెర తీసింద‌నే చెప్పాలి.