పాల‌మూరు కట్టితీరుతాం…చంద్ర‌బాబువి కుట్ర‌లంటూ తుమ్మ‌ల హాట్ కామెంట్స్‌

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు, నక్కలగండి ప్రాజెక్టులు కట్టి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తేల్చిచెప్పారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపాలని కోరుతూ చంద్ర‌బాబు కేంద్ర జ‌ల‌వ‌న‌రుల సంఘానికి లేఖ రాయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తెలంగాణలోని ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. పొరుగు రాష్ట్ర వ్యవహార శైలి రాజకీయ వ్యభిచారాన్ని తలపిస్తుందన్నారు.

ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకే ఇలాంటి సంఘటనలను చంద్రబాబు తెరపైకి తెస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సైతం పాల‌మూరు ప్రాజెక్టుకు సంబంధించి ప్రెస్‌మీట్ పెట్టి, త‌న‌కు తోచిన నిజాలేవో చెప్పుకొచ్చారు. పాల‌మూరు ప‌థ‌కానికి చంద్ర‌బాబు వ్య‌తిరేకం కాద‌ని సెల‌విచ్చారు. కేంద్రానికి ఏపీ స‌ర్కార్ రాసిన లేఖ‌లో కేవ‌లం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ మాత్ర‌మే ఇప్పించాల‌ని కోరింద‌ని పేర్కొన్నారు.