టూ ఫ్రెండ్స్ మూవీ రివ్యూ

ఆనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు ఆనంత రాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘టు ఫ్రెండ్స్’. ట్రూ లవ్ అనేది ట్యాగ్ లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర ప్రధాన తారాగణం నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు. ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. ట్రూ లవ్ గా తెరకెక్కిన ఈ టు ఫ్రెండ్స్ ఆడియన్స్ ని ఏవిధంగా అలరించిందో చూద్దాం పదండి..

కథ: నాని(సూరజ్), మిత్రవింద(సోనియా) క్లోజ్ ఫ్రెండ్స్. క్లాసులో నాని పూర్ స్టూడెంట్ కాగా.. మిత్రవింద క్లవర్. దాంతో ఎప్పుడూ నాని తల్లిదండ్రులతో తిట్లు తింటూ ఉంటాడు. అదే కళాశాలలో చదివే అవంతిక(ఫరా) నానికి పరిచయం అవుతుంది. ఇద్దరి స్నేహం కొంతకాలం సాగిన తరువాత నాని క్లాస్ లో మంచి మార్కులు సాధిస్తాడు. ఈక్రమంలో నాని అవంతిక ప్రేమలో పడతాడు. ఈ విషయాన్ని అవంతిక కు చెప్పగా… తనకు తన బావ ఉన్నాడని చెప్పి నాని ప్రేమను సున్నితంగా తిరస్కరిస్తుంది. ఇదేసమయంలో మిత్రవిందకు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చి వెళుతుంది. అక్కడ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న అఖిల్(అఖిల్ కార్తిక్)తో పరిచయం అవుతుంది. దాంతో మిత్రవింద, అఖిల్ మంచి స్నేహితులు అవుతారు. క్రమంగా అఖిల్… మిత్ర వింద ప్రేమలో పడి ప్రపోజ్ చేస్తాడు. అయితే మిత్ర వింద మాత్రం కాస్త టైం కావాలంటుంది. మరి అఖిల్ ప్రేమను.. మిత్రవింద అంగీకరించిందా? నాని, అవంతిక ప్రేమ ఏమైంది, అసలు అవంతిక బావ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

కథ.. కథనం విశ్లేషణ: ఇది నిజమైన స్నేహితుల ట్రూ లవ్ స్టొరీ. ప్రేమ, స్నేహం తో పాటు కెరీర్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పే కథ. అలానే కేవలం స్నేహితుల అవ్వగానే ప్రేమను అంగీకరించాలనే కండిషన్స్ వర్తించని కథ ఇది. ఇలా వైవిధ్యమైన కథను యూత్ కి కనెక్ట్ అయ్యేలా సరదా సన్నివేశాలతో కథనాన్ని నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో ధన్ రాజ్, స్నిగ్ధ లతో కాలేజీలో చిత్రీకరించిన సన్ని వేశాలన్నీ సరదాగా సాగిపోతాయి. అలానే కన్నడ కమెడియన్ సాధు కోకిల కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది. యూత్ కి కనెక్ట్ అవుతుంది.
హీరోలుగా నటించిన సూరజ్, అఖిల్ కార్తిక్ బాగా నటించారు. వారికి జంటగా నటించిన ఫరా, సోనియా లిద్దరూ చక్కగా నటించారు. వీరి మధ్య వచ్చే ప్రేమ, ఫ్రెండ్షిప్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లో బాగా నటించారు. కమెడియన్ సాధుకోకిల కామెడీ వర్క్ అవుట్ అయింది. ధన్ రాజ్, స్నిగ్ధ, కోటా శ్రీనివాసరావ్, జయప్రకాష్ రెడ్డి, కవిత తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు ఎంచుకున్న కథ, కథనాలు బాగున్నాయి. యూత్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు ను తెరమీద అందంగా చూపించారు. సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీ గా ఉంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడ లేదు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
రేటింగ్: 3