బెంగళూరులో ద్విచక్ర అంబులెన్స్

జనరల్ గా అంబులెన్స్ అనగానే అందరికీ నాలుగు చక్రాల వాహనమే తెలుసు.. కానీ కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులో దిచక్ర వాహన అంబులెన్స్ సేవలను ప్రారంభించింది.. ‘ప్లాటినం పదినిమిషాలు’ పథకం పేరుతో 30 అంబులెన్స్‌లను ప్రారంభించారు అక్కడి సీఎం సిద్ధరామయ్య.. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రథమ చికిత్స అందక ప్రాణాపాయంలో పడిపోయేవారికి పది నిమిషాల్లో చికిత్స అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

ట్రాఫిక్ ఇబ్బందులతో మామూలు అంబులెన్స్ వెళ్లలేని ప్రాంతాల్లో ఇవి ఉపయోగపడతాయని ఆరోగ్యశాఖా మంత్రి ఖాదర్ వెల్లడించారు. ఈ ద్విచక్ర అంబులెన్స్‌లో 53 రకాల మందులతో పాటు 40 రకాల పరికరాలు ఉంటాయి.