యు – కథే హీరో మూవీ రివ్యూ

యు – కథే హీరో మూవీ రివ్యూ

ఏ సినిమాకైనా కథే హీరో. అదే క్యాప్షన్ గా పెట్టుకొని యు టైటిల్ తో తెరకెక్కించాడు దర్శకుడు హీరో కొవెరా. శ్రీమ‌తి నాగానిక స‌మ‌ర్ప‌ణ‌లో కొవెరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కొవెరా, హిమాన్షి కాట్ర‌గ‌డ్డ హీరో హీరోయిన్లుగా రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాకు దాదాపుగా అన్నీ తానే పనిచేశాడు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ తో తన గురువు విజయేంద్రప్రసాద్ ఆదర్శంతో భారీ ఆలోచనతో… తన బడ్జెట్ లో తెరెకెక్కించిన చిత్రమిది. భారీ కాంపిటీషన్ నడుమ మంచి అంచనాలతో విడుదలైన యు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించే ఛాన్స్ ఉందో చూద్దాం.

కథేంటంటే:
రుద్రవరం ఎస్.ఐ.అభిమన్యు(కొవెరా)గా పనిచేసే ఓ సిన్సియర్ పోలీస్ అధికారి. అతను అదే గ్రామానికి చెందిన శశి(హిమాన్షి కాట్రగడ్డ) ప్రేమించి వివాహం చేసుకుంటారు. వీరిద్దరి జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అభిమన్యుకు ఓ వ్యక్తి నుంచి అన్ నోన్ కాల్ వస్తుంది.. అది ఏమంటే.. మీ వూరు హెడ్ మాస్టర్(శుభలేఖ సుధాకర్) అండర్ వరల్డ్ డాన్లతో సంబంధం వుంది. మొదట్లో తేలిగ్గా తీసుకున్న ఎస్.ఐ.కి… పదే పదే అదే కాల్ రావడంతో అనుమానం వచ్చి హెడ్ మాస్టర్ ను అరెస్టు చేస్తారు. ఇలాంటి క్రమంలో ఎస్.ఐ.అభిమన్యుపై కొంతమంది దుండగులు దాడి చేసి.. హెడ్ మాస్టర్ ను అపహరిస్తారు. ఇలా ఎస్.ఐ.పై దాడి చేసి.. హెడ్ మాస్టర్ ను అపహరించింది ఎవరు? అసలు హెడ్ మాస్టర్ ఎవరు? అతను రుద్రవరంలో ఎందుకు ఉన్నారు? అతనికి అండర్ వరల్డ్ మాఫియాకు సంబంధం ఏమిటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష
ఈ చిత్రానికి నిజంగా కథే హీరో. దర్శకుడు కొవెరా మంచి పాయింట్ గురించి చర్చించాడు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో జరిగే విషయాల్ని కళ్లకు కట్టినట్టు చూపించగలిగాడు. అండర్ వరల్డ్ నేపథ్యంలో చాలా కథలే వచ్చినప్పటికీ ఈ సినిమా కథ వాటికి విభిన్నంగా అనిపిస్తుంది. టేకింగ్ పరంగానూ ఎక్కడా తగ్గినట్టు కనిపించలేదు. అయితే అండర్ వరల్డ్ నేపథ్యం సినిమా అనగానే మానకు గన్ కల్చర్… రక్తపాతాలు మనకు కళ్లముందు కనిపిస్తాయి. అయితే అందుకు భిన్నంగా ‘యు’ చిత్రంలో ఓ సరికొత్త పాయింట్ ను టచ్ చేశారు హీరో కమ్ దర్శకుడు కొవెరా. అండర్ వరల్డ్ మాఫియా అక్రమంగా సంపాధించిన ఆర్థిక వ్యవస్థను మొత్తం కుప్పకూల్చి… వారిని ఆర్థికంగా బలహీనం చేసే.. ప్రాజెక్టు ‘యు’ అనే కాన్సెప్ట్ ను నేటి అన్ లైన్ బ్యాంకింగ్ వ్యవస్థను దృష్టిలో వుంచుకుని రాసుకున్న పాయింట్ సరికొత్తగా వుంది. ఫస్ట్ హాఫ్ లో సరదాగా సాగిన సినిమా ఇంటర్వెల్ ముందు ఓ ట్విస్ట్ తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచి.. సెకెండాఫ్ లో దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లి… అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యాన్ని హీరో చేధించడం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.

హీరో కొవెరా ఓ పవర్ ఫుల్ పోలీసు అధికారిగా చాలా బాగా నటించారు. ఈ పాత్రకు సరిగ్గా సరిపోయారు. యాక్షన్ సీన్స్ ని భారీగా ప్లాన్ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ హిమాన్షి కాట్రగడ్డ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హెడ్ మాస్టర్ గా శుభలేక సుధాకర్ ని డిఫరెంట్ పాత్రలో చూస్తాం. ఇప్పటివరకు ఆయన ఈ తరహా పాత్రలో నటించలేదు. అతని పాత్ర చుట్టే సాగే కథ, కథనం ఇంట్రెస్టింగ్ గా వుంది. ఈ చిత్రం హీరోనే సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల సినిమా తను అనుకున్న రీతిలో రావడానికి ఎంతో ఉపయోగ పడింది. టెక్నికల్ గా కూడా మ్యూజిక్, కెమెరా వర్క్ బాగా సహకరించాయి. మంచి నేపథ్య సంగీతం కూడా ఉంది. మాస్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది.

అండర్ వరల్డ్ స్టోరీస్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. అదే తరహాలో ప్రాజెక్ట్ యు ని కొవెరా విజయవంతంగా పూర్తి చేశాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా యు చిత్రం నిలిచింది. ముఖ్యంగా యూత్ ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలి. ఓవరాల్ గా కొవెరా అటు హీరోగా, ఇటు దర్శకుడిగా రెండింటిలోనూ పాసై ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయగలిగాడు. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3/5