యూ టర్న్ మూవీ రివ్యూ

సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఫాలోయింగ్ ఉన్న సమంత మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం యూ టర్న్. ఈ తరహా పాత్రలు ఎప్పుడో గానీ రావు. అలాంటి సమంతకు పెళ్లైన తర్వాత సరైన క్యారెక్టర్ దొరికింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్నే తెలుగులో అదే దర్శకుడు యూ టర్న్ పేరుతో రూపొందించాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే….
రచన (సమంత) ప్రముఖ పత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తుంది. ఫ్లై ఓవర్ మీద జరిగే మరణాల గురించి రిపోర్టర్ గా వర్క్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై జరిగే యాక్సిడెంట్ గురించి… అక్కడ యూ టర్న్ తీసుకునే వారి మనస్తత్వాల గురించి ఓ ఆర్టికల్ రాయాలనుకుంటుంది. ఆ కారణంతో యూటర్న్ తీసుకున్న ఓ వ్యక్తి ఇంటికి వెళ్తుంది.కానీ అక్కడ డోర్ తీయకపోవడంతో వెనుతిరుగుతుంది. కానీ వ్యక్తి చనిపోతాడు. దీంతోపోలీసులు రచనను ఇంటరాగేషన్ చేస్తారు. ఆమెను ఎంక్వైరీ చేసినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. కానీ పోలీసులు కేసును వదిలేస్తారు. అక్కడ యూ టర్న్ తీసుకున్న వాళ్లంతా చనిపోతారు. ఇంతకూ వాళ్లంతా ఎలా చనిపోయారు. ఆ మరణాలకు రచనకు ఎలాంటి సంబంధం ఉంది. అసలు యూ టర్న్ చేసిన వాళ్లే ఎందుకు చనిపోతున్నారనే విషయాలు తెలియాలంటే మాత్రం థియేటర్లోనే చూడాలి.

సమీక్ష
సమంత ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్. రచన పాత్రలో ఒదిగిపోయింది. తన పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది. ఫ్లై ఓవర్ మరణాల్ని తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో బాగా నటించింది. అంతే కాదు… తన పాత్రకు తగ్గట్టుగా తన హెయిర్ స్టైల్ ను కూడా మార్చుకుంది. డిఫరెంట్ లుక్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఎమోషన్స్ తో కూడిన కథ కాబట్టి సమంత పెర్ ఫార్మెన్స్ సినిమాకు బాగా ఉపయోగపడింది. ఆదికి చాలా మంచి పాత్ర దొరికింది. పోలీస్ ఆఫీసర్ గా కేస్ ఛేందించే పనిలో సమంతకు హెల్ప్ చేసే పాత్రలో బాగా నటించాడు. రాహుల్ సమంత లవర్ పాత్రలో నటించాడు. ఈసినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ భూమిక పాత్ర. ఈ సినిమాకు ట్విస్ట్ నిచ్చే క్యారెక్టర్ భూమికదే.

ఓ వైపు తాను అనుకున్నటార్గెట్ రీచ్ కావాలనే తపన, ఎదురయ్యే సవాళ్లు, భయం, ప్రేమ వీటన్నింటినీ సమంత బాగా బ్యాలెన్స్ చేసింది. దర్శకుడు ప్రవీణ్ కూడా కథను చాలా పాగడ్భందీగా రాసుకున్నారు. సినిమాలో అనేక మలుపులున్నాయి. యూ టర్న్ టైటిల్ కు తగ్గట్టుగానే సీన్ సీన్ కు ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అసలు చావులు ఎలా జరిగాయి. హత్యా, ఆత్మహత్యా అనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచి చాలా సేపు ఆలోచింపజేశాడు. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే విషయంలో సక్సెస్ సాధించాడు. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు చాల నే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. సమంత, మదర్ ఫోన్ ట్రాక్ కామెడీగా ఉంటుంది. కామెడీ పాళ్లు చాలా తక్కువగా ఉంటాయి. దర్శకుడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథ నడిపించాడు. తెలుగు కోసం పలు మార్పులు చేశారు. అయితే అక్కడక్కడ దర్శకుడు చిన్న చిన్న పొరపాట్లు కూడా చేశాడు. కారణాలు మరీ సిల్లీగా కనిపిస్తాయి. చాలా సన్నివేశాల్ని ముందు గుర్తించేలా కనిపిస్తాయి. చాలా చోట్ల స్లో నరేషన్ దెబ్బతీసింది. సమంత రాహుల్ ట్రాక్ ని ఇంకా బాగా రాయాల్సింది. టెక్నికల్ గా నికెత్ బొమ్మి రెడ్డి కెమెరా వర్క్ చాలా బాగుంది. ఈ సినిమాకు చాలా చాలా ప్లస్ అయ్యింది. పూర్ణ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ సురేష్ వర్క్ బాగుంది. నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఓవరాల్ గా… దర్శకుడు పవన్ కుమార్ మ్యాజిక్ చేశాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో థ్రిల్ కి గురిచేశాడు. సస్పెన్స్ మర్డర్ మిస్టరీల్ని ఛేందించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సమంత ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆమె క్యారెక్టర్, యాక్టింగ్ ఇంప్రెస్ చేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుంది.

Rating : 3.25/5