దేశానికి సేవలందించాల్సిన సైనికుడు సిగ్గుమాలిన పని చేశాడు. ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్, బల్లియాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. అతడి పేరు ములాయం యాదవ్ . సీఆర్పీఎఫ్ జవాన్. తన వదిన తరఫు బందువుల అమ్మాయిని లొంగ దీసుకుని, ఆమెపై అత్యాచారంచేశాడు. ఇరవై ఏళ్ల వయస్సున్న ఆ యువతిని పెళ్లాడతానని చెప్పి , ఏడాదిగా ఆమెను శారీకంగా అనుభవిస్తూ, మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు.
చివరికి తననెప్పుడు పెళ్లి చేసుకుంటావని యువతి ప్రశ్నించడంతో ఆ కామాంధుడు ఎదురుతిరిగాడు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చేశాడు. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించి, తన గోడు వెళ్లబోసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జవానును అదుపులోకి తీసుకున్నారు.