కమల్ ఉత్తమ విలన్ ఆడియో విడుదల ఖరారు

కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ తెలుగు ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. తమిళంలో ఆల్రెడీ ఈ చిత్ర పాటలు విడుదలయ్యాయి. ఈనెల 28న హైదరాబాద్ లో ఉత్తమ విలన్ తెలుగు ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర తెలుగు హక్కుల్ని సి.కళ్యాణ్ సొంతం చేసుకున్నారు.

రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకుడు. కమల్ హాసన్ నటించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్, స్టోరీ అందించారు. కె.బాలచందర్, కె. విశ్వనాద్,కమల్ హాసన్, జయరామ్, ఆండ్రియా, పూజా కుమార్, పార్వతి నాయర్ కీలక పాత్రలు పోషించారు. గిబ్రాన్ సంగీతమందించాడు. దాదాపు అరవై కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.