వదలడు మూవీ హీరోయిన్ కేథరీన్ థెరిస్సా ఇంటర్వ్యూ

టాలీవుడ్‌కు పరిచయం అక్కరలేని పేరు కేథరిన్ థెరిస్సా. ‘ఇద్దరు అమ్మాయిలు, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి’.. వంటి చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపును పొందిందీ భామ. ప్రస్తుతం ఆమె హీరో సిద్ధార్థ సరసన ‘ఆరువం’ అనే తమిళ చిత్రంలో నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘వదలడు’ అనే టైటిల్‌తో అక్టోబర్ 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ కేథరిన్.. తన డ్రీమ్ రోల్ గురించి తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు డ్రీమ్ రోల్ అనేది ఏమీ లేదు. కాకపోతే వైవిధ్యం ఉన్న అనేక పాత్రలు చేయాలి, ఏ పాత్రనైనా చేయగల వెర్సటైల్ యాక్టర్ అనిపించుకోవాలి. అందుకే తెలుగులో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసినా తమిళంలో యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తున్నాను. ‘మద్రాస్’ సినిమాలో నేను చేసిన పాత్ర ప్రత్యేకం, అలాగే ఇప్పుడు ‘వదలడు’ చిత్రంలోని పాత్ర కూడా. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే పాత్రలు చేయడమే నా డ్రీమ్ రోల్. అందుకు ఫస్ట్ హీరోయినా, సెకండ్ హీరోయినా అనేది ఆలోచించను. స్క్రిప్ట్ లో మన పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏమిటీ, అన్నదే ముఖ్యం..’’ అని అన్నారు.