ప్రముఖులతో పాటు… అన్ని ఏరియాల నుంచి వైశాఖంకు సూపర్ హిట్ టాక్…

డైనమిక్ లేడీ డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో… బి.ఎ.రాజు నిర్మాతగా… హరీష్, అవంతిక జంటగా నటించిన వైశాఖం చిత్రం ఇటీవలే రిలీజై ఆల్ సెంటర్స్ లో సూపర్ హిట్ టాక్ తో విజయపథంలోకి దూసుకెళ్తోంది. ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అపూర్వంగా ఆదరిస్తున్నారు. చాలా మంది ప్రముఖులు సైతం ఈ చిత్రాన్ని చూడడంతో క్లాస్ ఆడియోన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ వచ్చింది. వైశాఖం సినిమా ను శ్రీ కెసిఆర్ ఫ్యామిలీ, టి సుబ్బిరామిరెడ్డి ఫ్యామిలీ, జిఎంఆర్ ఫ్యామిలీ క్యూబ్ లో చూసినట్టు తెలుస్తోంది.

జయ బి డైరెక్షన్లో ఆర్ జె సినిమాస్ బ్యానర్ పై బిఎ రాజు నిర్మించిన వైశాఖం క్లైమాక్స్ మానవతా విలువల్ని గుర్తు చేస్తూ హార్ట్ టచింగ్ గా వుందని పబ్లిక్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఓవరాల్ గా మాస్ క్లాస్ నుంచి వస్తున్న స్పందనతో చిత్ర బృందం ఫుల్ హ్యాపీగా ఉంది.