వజ్ర కవచధర గోవింద మూవీ రివ్యూ….

స్టార్‌ కమెడియన్‌ సప్తగిరి, యంగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ పవార్‌ కాంబినేషన్‌ లో వచ్చిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఎంతటి ఘ‌న విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్‌లో శివ శివమ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ‘వజ్రకవచధర గోవింద’. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్స్ ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.

కథేంటంటే….
సప్తగిరి (గోవింద) తన ఊరి జనం వరుసగా క్యాన్సర్ తో చనిపోతుండటాన్ని జీర్ణయించుకోలేకపోతాడు. ఎలాగైనా తన ఊరి జనాన్ని కాపాడటానికి చేసే ప్రయత్నంలో ‘ఎమ్ఎల్ఏ’ లక్ష్మి ప్రసన్న (అర్చన శాస్త్రీ) చేతిలో దారుణంగా మోసపోతాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం సప్తగిరికి తన ఊరి ప్రజలను కాపాడుకోవడానికి ‘నిధి’ రూపంలో మరో అవకాశం వస్తోంది. అయితే నిధి కోసం వెతికే ప్రయత్నంలో రౌడీల చేతిలో చిక్కుకుంటాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల తరువాత సప్తగిరి రౌడీల నుండి ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? అసలు సప్తగిరికి నిధి దొరికిందా ? తన ఊరి ప్రజల కష్టాలను తీర్చాడా ?ఇంతకీ రౌడీల నుండి తప్పించుకోగలిగాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

సమీక్ష
సప్తగిరి రెగ్యులర్ కథలు కాకుండా విభిన్నమైన చిత్రాల్ని ఎంచుకుంటున్నాడు. తనకు మాత్రమే సెట్ అయ్యే పాత్రలతో మెప్పిస్తున్నాడు. అలాగే వజ్ర కవచ ధర గోవింద చిత్రంలోని పాత్ర కూడా సప్తగిరికి సరిగ్గా సరిపోయింది. నిధుల కోసం వెతికే క్రమంలో కావచ్చు, గతం మర్చిపోయే సన్నివేశాల్లో కావచ్చు, హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ లో కావచ్చు… తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. నిజంగానే గుహల్లోకి వెళ్లి చేసిన సీన్స్ బాగున్నాయి. ఆ సీన్స్ సాహసమే అనే చెప్పాలి. హీరోయిన్ వైభవి జోషి అందం అభినయంతో ఆకట్టుకుంది. కొన్ని సందర్భాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో నిండుగా కనిపించింది.
గ్లామరసం పండించింది. ముఖ్యంగా అవినాష్ బ్యాక్ బోన్ గా నిలిచాడు. జబర్దస్త్ అవినాష్ గా పేరు తెచ్చుకున్న ఇతను… సినిమా ఆద్యంతం నవ్వించగలిగాడు. చివర్లో ఎంటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి, వేణు అలాగే మిగిలిన కమెడియన్స్ అందరూ తమ కామెడీ టైమింగ్‌ తో నవ్వించే ప్రయత్నం చేశారు. విలన్ బంగారయ్యగా నటించిన నటుడు కూడా తన ఆహార్యంతో కథలో సీరియస్ నెస్ తీసుకొచ్చారు. క్యాన్సర్ తో పిల్లాడి చనిపోయే సన్నివేశాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేశారు. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతీ పాత్రకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏ పాత్ర కూడా వేస్ట్ కాలేదు. డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. కామెడీ పరంగా సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సప్తగిరికి కరెంట్ షాక్ ఇచ్చి విజ్రం వివరాలు కనుక్కునే సీన్ హిలేరియాస్ గా పండింది.

సప్తగిరి ని హీరోగా ఎస్టాబ్లిష్ చేసే బిల్డప్ షాట్స్ బాగున్నాయి. అవసరమైన చోట హీరోయిజం, కామెడీ పండించాడు. సప్దగిరి సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ చూపించాడు. యాక్షన్ సీన్స్ బాగా ప్లాన్ చేశారు. కమర్షియల్ గా కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. క్యాన్సర్ ఎలిమెంట్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసారు. ఊర్లో జనం చనిపోవడం, ఎమ్మెల్యేతో వార్ సీన్స్ ని బాగా ప్లాన్ చేసారు. డైరెక్టర్ అరుణ్ పవర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమేం ఉండాలో అన్నీ సెట్ చేశాడు. స్క్రీన్ ప్లే పరంగా కూడా సక్సెస్ అయ్యాడు. కెమెరా వర్క్, బుల్గానిన్ మ్యూజిక్, రీ రికార్డింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి. కథకు తగ్గట్టుగా బాగా ఖర్చు పెట్టారు. పాటల్ని బాగా షూట్ చేశారు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ని బాగా మెప్పిస్తుంది. మాస్ ఎలిమెంట్స్ ని పక్కాగా బాగా చిత్రీకరించారు.

ఓవరాల్ గా…. సప్తగిరి గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా విభిన్నంగా సాగుతుంది. ఎక్కడా ఫ్లో మిస్ కాకుండా కామెడీ కావాల్సిన చోట కామెడీ… ఎమోషన్ కావాల్సిన చోట ఎమోషన్…. ఫైట్స్ కావాల్సిన చోట ఫైట్స్, పాటలు రావాల్సిన చోట సాంగ్స్ ఇలా పక్కాగా ప్లాన్ చేశాడు దర్శకుడు. సప్దగిరి కథను తన భుజాల మీదేసుకొని ముందుకు నడిపించాడు. మాస్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వజ్ర కవచధర గోవింద మెప్పిస్తుంది. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5